YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంపీ ఆర్వింద్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలి

ఎంపీ ఆర్వింద్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలి

ఎంపీ ఆర్వింద్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలి
టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఆన్నం ఆనీల్
జగిత్యాల  ఏప్రిల్ 10
ప్రపంచం మంతటా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కనిపించని శత్రువు కారోనా వైరస్ తో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, అధికారులు పోరాటంలో చేస్తుంటే కనీసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించకుండా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ శవ రాజకీయ చేస్తున్నారని కోరుట్ల టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఆన్నం ఆనీల్ ఆన్నారు. శుక్రవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పట్టణాధ్యక్షుడు మాట్లాడుతూ వృద్దాప్యం దానికి తోడు గుండెపోటుతో మృతి చెందిన కౌన్సిలర్ తండ్రి గంగారాం మృతిని రాజకీయ హత్యగా రంగు పూసి శవ రాజకీయాలకు తెరలేపడం ఎంపీ ధర్మపురి ఆర్వింద్ మానుకోవాలన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోకుండా ,ప్రజలపై ప్రేమ లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటు ఆని ,అధికాక మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. సంవత్సర కాలం గడిచిన ఎలాంటి అభివృద్ధి చేయని ఏకైక ఎంపీగా మిగిలారన్నారు. హామీ ఇచ్చిన పసుపు బోర్డు తేలేక పోయారని, రైతులు సరీయైన బుద్ధి చెబుతారన్నారు. కోరుట్ల నియోజకవర్గం ప్రజా ఆరోగ్య కోసం అధికారులతో రోజువారి వివారాలు సేకరిస్తూ ,ఆకలితో అలమటిస్తున్న నిస్సహాయులకు , వలస కార్మికులు, పేద కుటుంబాలకు ఆన్నంపేడుతూ అపన్న హస్తం అందిస్తూ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లను విమర్శించడం సరైన పద్దతి కాదన్నారు. పట్టణంలో ప్రజలు కుల ,మతాల అతీతంగా ఉన్న వారి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే పట్టణ ప్రజలు సరియైన బుద్ధి చెప్తారన్నారు. తోటి కౌన్సిలర్ తండ్రి మరణం తీరనిలోటని ,టీఆర్ఎస్ పార్టీ తరుపున వారి కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం,యాటం కరుణాకర్, బట్టు సునీల్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ,జిందం లక్ష్మీనారాయణ,గంధం గంగాధర్ ,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, నాయకులు చింతామణి ప్రభాకర్ ,సనావోద్దిన్ ,జాలా వినోద్
తదితరులు పాల్గొన్నారు

Related Posts