YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

అమెరికా చైనాల మధ్యదూరాన్ని పెంచిన కరోనా వైరస్

అమెరికా చైనాల మధ్యదూరాన్ని పెంచిన కరోనా వైరస్

అమెరికా చైనాల మధ్యదూరాన్ని పెంచిన కరోనా వైరస్
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 10 
కరోనా వైరస్ విలయతాండవం అమెరికా చైనాల మధ్యదూరాన్ని పెంచింది. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఇటీవలే రాజీకి వచ్చినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ గెబ్రేసియస్ విషయమై మళ్లీ రెండు ప్రపంచశక్తుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. గురువారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశంలో ఇవి మరోసారి ముందుకు వచ్చాయి. వైరస్ మూలం, లక్షణాలు, వ్యాప్తిపై శాస్త్రీయపరమైన డేటా సేకరణ, విశ్లేషణ జరగాలని అమెరికా ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ పిలుపునిచ్చారు. ఈ విధానాలకు ఎంత ప్రాముఖ్యమున్నదో నొక్కిచెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ మూలం అనే మాటలు చైనాను ఉద్దేశించి చేసినవేనని అర్థం అవుతూనే ఉంది. కరోనా వైరస్‌ను చైనా వైరస్ అని, వూహాన్ వైరస్ అని అమెరికా ప్రస్తావించడం, దీనిీపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడం చాలారోజులుగా జరుగుతూనే ఉంది. వైరస్ మొదటగా చైనాలో బయటపడిందని, చైనా గనుక సత్వరం స్పందిస్తే ప్రపంచం పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదనే ధోరణిలో అమెరికా మాట్లాడుతున్నది. ఇది చైనాకు ఏమాత్రం రుచించే విషయం కాదు. కాగా వైరస్ విషయంలో ఎవరినీ వేలెత్తి చూపడం, నిందమోపడం లాంటివి జరుగరాదని చైనా రాయబారి జాంగ్ జున్ అన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. సమావేశం ప్రాంరంభంలో మండలికి కరోనా వైరస్ పరిస్థితిని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ వివరించారు. సమితి ఏర్పడిన 75 సంవత్సరాల కాలంలో ఇదే అత్యంత ఘోరమైన అగ్నిపరీక్ష అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఆయన ఒకతరం జరుపుతున్న పోరాటంగా అభివర్ణించారు. సమావేశం చివరన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కట్టడికి గుటెరెస్ చేపట్టిన చర్యలకు మద్దతు తెలుపుతూ మండలి సంక్షిప్త తీర్మానాన్ని ఆమోదించింది.

Related Posts