YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ లాసెట్-2018 దరఖాస్తు గడువు 10వ తేదీ వరకు పొడిగింపు!!

ఏపీ లాసెట్-2018 దరఖాస్తు గడువు 10వ తేదీ వరకు పొడిగింపు!!

ఏపీ లాసెట్-2018 దరఖాస్తు గడువు ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.రాజగోపాల్ చెప్పారు. లాసెట్ ‌పోటీ పరీక్షను ఐదు సంవత్సరాలుగా ఎస్కేయూ లా విభాగం నిర్వహిస్తున్నట్లు అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్ తెలిపారు. ఏప్రిల్ ఐదో తేదీతో లాసెట్ -2018 దరఖాస్తు గడువు పూర్తవుతుందని, పదో తేదీవరకు ఆలస్యపు రుసుముతో దరఖాస్తు చేయడానికి నోటిఫికేషన్లో ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే తాజాగా దీనిలో మార్పుచేసి ఎలాంటి అదనపు రుసుం లేకుండా ఈనెల పదోతేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. లాసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చన్నారు. గత ఏడాదికంటే ఈసారి లాసెట్ దరఖాస్తులు తగ్గినట్లు వీసీ తెలిపారు. ఈనెల 19న లాసెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఆయన హెచ్చరించారు.

Related Posts