YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అక్రమార్కుల మీద ఉక్కుపాదం .. అవినీతి సహిoచం

అక్రమార్కుల మీద ఉక్కుపాదం .. అవినీతి సహిoచం

అక్రమార్కుల మీద ఉక్కుపాదం .. అవినీతి సహిచం ప్రైవేటు బస్సులకు సిటీలో ఎంట్రీ మీద మంత్రి మహేందర్ రెడ్డి సీరియస్ 

అక్రమ రవాణా, వోవర్ లోడ్లతో పాటు అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని   రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బండ్లగూడతో పాటు రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయల్లో అవినీతి సహించేదిలేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులతో సమావేశంయ్యారు. అలాగే అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమిక్షించారు. లారీ ఓనర్స్ సమస్యల మీద ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం ఇదివరకే జరిగాయని వారం రోజుల్లో జరిగే మరో సమావేశంలో ఏపీతో సింగిల్ పర్మిట్ విధానం మీద చర్చిస్తామని అన్నారు. గతంలో తాము ఏపి ప్రభుత్వానికి డిమాండ్ చేసిన విధంగా వారంలో ప్రభుత్వం కమిటీని ఏపికి పంపి చర్చలు జరుపుతామన్నారు. తోహాస్ మీద బండ్లగూడలో చోటు చేసుకున్నఅవినీతి మీద హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని చెప్పారు. మార్కెట్లు,తైబజార్ ల వద్ద అన్ని జిల్లాల కలెక్టర్లు, లేబర్ కమీషనర్  లకు అన్ లోడింగ్ వద్ద డ్రైవర్లను వేదించి మామూళ్ళను వసూలు చేసే అంశాల మీద చర్యలకు ఆదేశిస్తామని వివరించారు.తోహాస్ అక్రమాల మీద క్రిమినల్ కేసులకు ఆదేశించామని చెప్పారు.రాష్ట్రం లో లారీ ఓనర్స్ అసోసియేషన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏడాదిలోగా సంత భవనాలు ……

రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయాలకు ఏడాదిలోగా స్వంత భవనాలు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఇందుకు భవనాలు లేని కార్యాలయాల మీద ఆరాతీశారు. రాష్ట్రంలో ని 54 రవాణా శాఖ కార్యాలయాలకు కేవలం 16కు మత్రమే స్వంతభవనాలుయన్నారు. అయితే స్వంత భవనాలకు స్థల సేకరణ వేగంతగా చేయని మెదక్ లాంటి ప్రాంతాల అధికారుల పనితీరు మీద మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 18 కర్యాలయాలకు స్థల సేకరణ పూర్తయిందని, మరో 12 కార్యాలయాలకు స్థల సేకరణ జరగాల్సి ఉందని అధికారులు ఆయా జిల్లా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలను కలిసి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల భర్తీ, ఖాళీగా ఉన్నఅధికారుల నియామకాలకు సీఎం కేసీఆర్ కు నివేదిస్తామని వెల్లండించారు. రాష్ట్రంలో రవాణా శాఖ టార్గెట్ లో రూ.3400 కోట్లు రాబట్టిందని అన్నారు. వోవర్ లోడింగ్ తో పాటు ప్రజల ప్రాణాలతో చలగాటం అడే వాహనాలు, డ్రైవర్ల మీద కఠినంగా వ్యవహరించాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు భద్దత, ప్రమాదాల నివారణ మీద ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాల నివారణ చర్యలు కఠినంగా తీసుకోవాలని , అవగాహన సదస్సులు ఏర్పాటు మరింత పెంచాలని  మంత్రి  సూచించారు. అక్రమ రవాణా నివారించేందుకు చెక్ పోస్టులను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కల్గిస్తున్న సిటీ లో తిరిగే దూర ప్రాంతం ప్రైవేటు బస్సుల మీద మంత్రి సీరియస్ అయ్యారు. ఇక మీదట ప్రైవేట్ బస్సులు సిటీలో రాకుండా రింగ్ రోడ్డు దగ్గరే నిలిపివేయాలని అదేశించారు.అయితే రింగ్ రోడ్డు నుంచి సిటీ లోపలకు రావడానికి ప్రయాణికులకు ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని చెప్పారు.ఆర్టీసీ, రవాణా శాఖ ల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ సునీల్ శర్మ, జేటీసీలు,డీటీసీలు పాండురంగనాయక్, రమేష్, డీటీసీలు ప్రవీణ్ రావు, చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్  పుప్పాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts