YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

హైద్రాబాద్ నుంచి అమెరికాకు రెండు విమానాలు

హైద్రాబాద్ నుంచి అమెరికాకు రెండు విమానాలు

హైద్రాబాద్ నుంచి అమెరికాకు రెండు విమానాలు
హైద్రాబాద్, ఏప్రిల్ 11 
దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉన్న వేళ హైదరాబాద్‌లో చిక్కుకున్న అమెరికన్లను వారి స్వదేశానికి చేర్చేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు బయలుదేరాయి. ఈ రెండు విమానాలు ముంబయికి వెళ్లి, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నాయి. ఒక విమానంలో 70 మంది, మరో విమానంలో 98 మంది వెళ్లారు. వీరంతా ముంబయి చేరుకొని అక్కడి నుంచి మరో ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లనున్నారు.అమెరికన్ కాన్సులేట్, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో ఈ అమెరికా జాతీయులను స్వస్థలాలకు చేర్చే ప్రక్రియ సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను సిబ్బంది పూర్తిగా శానిటైజ్ చేసి ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌కు పంపించారు. టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు.లాక్ డౌన్ వల్ల శంషాబాద్ ఎయిర్ పోర్టు మూసేసిన నేపథ్యంలో ఇలాంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, ఏవోసీసీ, ఏటీసీ, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్, ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ సేవల సిబ్బంది తదితరులు పని చేస్తూనే ఉన్నారు.

Related Posts