కారులో ప్రేమ జంట పనులు...
రోమ్, ఏప్రిల్ 11
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించండని వైద్యులు, ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా.. ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరికి నిబంధనలు సైతం ఉల్లంఘించి బరితెగిస్తున్నారు. ఇందుకు ఇటలీలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కరోనా పుట్టిన చైనా కంటే.. ప్రమాదకరంగా ఇటలీ మారిన సంగతి తెలిసిందే. మరణాల విషయంలో కూడా చైనా సంఖ్యను ఇటలీ దాటేసింది. దీంతో ప్రభుత్వం దేశంలో ‘లాక్‌డౌన్’ ప్రకటించారు. ప్రజలు బయట గుంపులుగా తిరగకుండా నిషేదించారు. మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థన మందిరాలు.. ఇలా అన్నీ మూసివేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని తెలుపుతున్నారు. ప్రజలు పక్క పక్కనే నడవ కూడదని పేర్కొన్నారు. మనిషికి మనిషికి మధ్య కనీసం ఒకటి నుంచి రెండు మీటర్ల దూరం ఉండాలని పేర్కొంటున్నారు. చివరికి కార్లలో కూడా ప్రజలు పక్క పక్కన కుర్చోకూడదని, ముందు ఒకరు వెనుక సీట్లో ఒకరు మాత్రమే కుర్చొని ప్రయాణించాలనే రూల్ పెట్టారు. అయితే, ఓ జంట ఈ నిబంధన ఉల్లఘించింది. ఇద్దరు ఒకే సీట్లో కుర్చోవడమే కాదు, ఏకంగా సెక్సులోనే పాల్గొన్నారు. చివరికి పోలీసులకు దొరికి చిక్కుల్లో పడ్డారు.ఇటలీ ప్రజలు కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడలేదు. ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా విహార యాత్రలకు వెళ్తున్నారు. ఇటీవల కొందరు భక్తులు ప్రార్థన మందిరాల్లో ఆలయ గోడలను తలుపులను నాకుతూ వింతగా ప్రవర్తించారు. ఆఫీసులు, మాల్స్ అన్నీ మూసేసి.. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలిస్తే.. కుటుంబాలతో కలిసి పిక్నిక్‌లకు వెళ్లారు. దీంతో నిబంధనలు కఠినతరం చేశారు. ఎవరూ బయట తిరగవద్దని.. కనిపిస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన కింద అరెస్టు చేస్తామని తెలిపారు. అయితే, మిలాన్ శివారులోని రోడ్డుపక్కన 23 ఏళ్ల ఈజిప్టు యువకుడు, 43 ఏళ్ల తునీషియా మహిళ కారులో శృంగారం చేసుకుంటూ పోలీసుల కంట పడ్డారు. దీంతో పోలీసులు వారిపై ‘కరోనా వైరస్ దిగ్బంధం నియమం’ ఉల్లంఘన కింద వారిని అరెస్టు చేశారు. అయితే, వీరిపై కారులో శృంగారం చేసుకుంటున్న కేసు పెట్టకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు ఒకే సీట్లో కలిసి ఉన్నారనే కారణంతోనే వారిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.