కరోనాపై ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్ ఏప్రిల్ 11 (న్యూస్ పల్స్)
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కరోనా మహమ్మారి నియంత్రణ, అవగాహన పై రాత్రి లేదు.. పగలు లేదు... కంటి మీద కునుకులేదు...మన కోసం.. అనే ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు. శనివారం జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ సంస్థ ఎండీ మనోహర్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకుడు నరేందర్ గౌడ్ నాగులూరి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కరోనా మహమ్మారి నియంత్రణ, అవగాహన కోసం అనుక్షణం ముందస్తు జాగ్రత్తల పై అధికారులతో సమన్వయం చేసుకొని కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారన్నారు. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను, గాయకులను మంత్రి అభినందించారు. అవగాహన గీతాలు.., జాగో.. జాగోరే తెలంగాణ పాటను యశ్ పాల్ రచించగా సంతోష్ పాడారు. కరోనా మహమ్మారి పై అభినయ శ్రీనివాస్ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ పాడారు. కమ్ము కొచ్చే కరోనా అనే పాటను కోదాడ శ్రీనివాస్ రచించిన పాటకు వీణ పాడారు. అమ్మలారా అలకించండి అనే పాటను జలజ రచించిన పాటకు మెడికొండ ప్రసాద్ పాడిన అవగాహన గీతాలను ఇప్పటికే విడుదల చేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కష్టకాలంలో కరోనా మహమ్మారి నియంత్రణ కు అత్యవసర సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు అందిస్తున్న సేవలకు నీరాజనం గా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించామన్నారు.