YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా అధికారం ఇక పై కలెక్టర్లకే..!

Highlights

  • రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా అధికారం ఇక పై కలెక్టర్లకే.. 
  • ప్రజా సమస్య పరిష్కారానికే  ఈ నిర్ణయం..
  • గ్రామకంఠాలను సబ్ డివిజన్ చేసి నిషేధిత జాబితా నుంచి తొలగింపు
  • రెవెన్యూ అధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష
రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా అధికారం ఇక పై కలెక్టర్లకే..!

రాష్ట్రంలో 22-A నిషేధిత భూములను సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితా నుండి ఆస్తులను తొలగించే అధికారాలను జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ ప్రజలకు తప్పనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22-A రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా కు సంబంధించి  అందుతున్న ఫిర్యాధుల కు సంబంధించి ఎమ్మెల్యేలు ఉపముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకువచ్చారు.  సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అసెంబ్లీలోని కమిటీ హాల్ వేదికగా ఉపముఖ్యమంత్రి రెవెన్యూ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ , సి.సి.ఎల్.ఏ అనీల్ చంద్రపునేఠా, సర్వే కమీషనర్ జగన్నాధం, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్, వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 22- A నిషేధిత జాబితా రూపకల్పన ఇప్పటివరకు మ్యాన్యువల్ గా జరిగేదని, ఇక నుంచి జాబితాను డిజిటల్ ఫార్మాట్ లో తయారు చేసి జిల్లా కలెక్టర్ నేరుగా జిల్లా రిజిస్ట్రార్ కు అందించేలా  ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. సమస్యకు 3 నెలల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వుడా అప్రూవ్ చేసిన అధికారిక లేఅవుట్లుకు కూడా అప్రోచ్ రోడ్లు ,డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వ భూమి ఇవ్వట్లేదని, దీని వల్ల ప్రజలు సమస్యలు ఎదుర్కోంటున్నారని తెలిపారు. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అసవరమైన భూమికి మార్కెట్ ధర చెల్లించడానికి కూడా ప్రజలు ముందుకు వస్తున్నారని గుర్తు చేశారు. దీని పై స్పందించిన ఉపముఖ్యమంత్రి వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం పై నిర్ణయం తీసుకుంటామని,   నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామకంఠాలను సబ్ డివిజన్ చేసి నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అర్బన్ మండలాల ఏర్పటు చేసినందుకు ఉపముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు క్రుతజ్ణతులు తెలిపారు.అలాగే రాజానగం, జగ్గయ్యపేట, తిరుపతి  ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఏర్పాటు చేసుకున్న అలాగే సాగు చేసుకుంటున్న ఇనామ్ భూములను కూడా 22-A జాబితాలో చేర్చారని, సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేలు కోరారు. ఇనామ్ భూముల సమస్యకు పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేత్రుత్వంలో కమిటీ వేశామని ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు తెలిపారు. హైకోర్టు తీర్పు ఉండడంతో సర్వీస్ ఇనామ్ భూములను క్రమబద్దీకరించలేమని, దీనికి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తామని దేవదాయ కమీషనర్ ఎమ్మెల్యేల ద్రుష్టికి తీసుకువచ్చారు.

Related Posts