YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
ములుగు ఏప్రిల్ 11 
ములుగు పట్టణం లోని హనుమాన్  నగర్ కు చెందిన 30 నిరు పేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఐదు  కేజీ బియ్యం పప్పు కూరగాయలు ములుగు ఎమ్మెల్యే సీతక్క  శనివారం పంపిణి  చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ     కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో ప్రతి గ్రామానికి చెప్పుకుంటూ వెళ్తూననాని అన్నారు.  కరోనా వైరసుకి వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు అని నివారణ ఒకటే మార్గమని అన్నారు.   కరోనా వైరస్ అంటువ్యాధి అని ఒకరి నుండి ఒకరికి అత్యంత తొందరగా చేరుకుంటుందని అందుకే ఈ అత్యవసర స్వీయ గృహ నిర్బంధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి కనుక ప్రతి ఒక్కరు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించి ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా వుండాలని అన్నారు.  ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వచ్చిన మొహానికి మాస్క్ ధరించాలని అలాగే బయటికి వెళ్ళివచ్చాక శానిటైజర్,  సబ్బులతో చేతులు, కాళ్ళు పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్లాలని అన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఏప్రిల్ 14 వరకు అత్యవసర కర్ఫ్యూ విధించడం వల్ల ఎవరు బయటికి రాకుండా ఉండి కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి  జీవంతరావు పల్లి సర్పంచ్ రత్నం భద్రయ్య, ఆకుతోట చంద్రమౌళి, బొల్లం రవి,గణేష్ ,గోలి గోవర్ధన్,మోరే రాజు,కొండబోయిన స్వామి,అజ్మీర శ్రీధర్,దేవుసింగ్,శంకర్  దేవు రాజు,తదితరులు పాల్గొన్నారు

Related Posts