YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దేశమంతా  కరోనా నివారణకు పని చేస్తుంటే..

దేశమంతా  కరోనా నివారణకు పని చేస్తుంటే..

దేశమంతా  కరోనా నివారణకు పని చేస్తుంటే..
అమరావతి ఏప్రిల్ 11 
రాష్ట్రాలన్నీ కరోనా నివారణకు పనిచేస్తుంటే ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు సీఎం జగన్ ను ఎన్నికల కమిషనర్ను విమర్శించేందుకు తొలి మీడియా సమావేశం నిర్వహించారని  అయన విమర్శించారు. ప్రజల ప్రాణాలను రక్షించాలని రమేష్ కుమార్ ఎన్నికల్ని వాయిదా వేశారన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించి చూపి ఏదో విధంగా ఎన్నికల ప్రక్రియను ముగించుకోవాలనే తాపత్రయంలోనే సీఎం ఉన్నారన్నారు. ఇందుకు రాజ్యాంగ విలువల్ని కాలరాస్తున్నారని ఆనందబాబు విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసే వ్యక్తిగా సీఎం ముందుకెళ్తున్నారన్నారు. న్యాయస్థానాల్ని బ్లాక్మెయిల్ చేసే దిశగా జగన్ చర్యలున్నాయన్నారు. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం కల్పించేందుకు కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే కరోనా నివారణకు రాష్ట్రంలో చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రీతిలో చర్యలు చేపట్టడం లేదన్నారు. సీఎం మొదటి నుంచి దీనిని చాలా తేలిగ్గా తీసుకోవటం వల్లే రాష్ట్రంలో కరోనా 3వ దశకు వ్యాపించిందన్నారు.

Related Posts