పోలీసుల ముందు ఎమ్మెల్యే ధర్నా
నెల్లూరు ఏప్రిల్ 11
కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధర్నా కు దిగారు. శుక్రవారం పేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం పై ఎమ్మెల్యే, వైసిపి నాయకులు పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నల్లపురెడ్డి మాట్లాడుతూ ఏసీ రూముల్లో కూర్చున్న ఎస్పీకి ప్రజల బాధలు కనపడట్లేదు. రాష్ట్రమంతా పంపిణీ కార్యక్రమం చేపడుతుంటే మా పై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. మేమేం తప్పు చేశాం. ఎందుకని కేసు నమోదు చేశారని అన్నారు. కావాలంటే అరెస్ట్ చేసుకోండి. దీన్ని వదిలిపెట్టేది లేదు ఎంత దూరమైనా వెళ్తానని అయన అన్నారు.