YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వైద్యుల సేవలు అభినందనీయం

వైద్యుల సేవలు అభినందనీయం

వైద్యుల సేవలు అభినందనీయం
కరోనా పాజిటివ్ వ్యక్తులకు నాణ్యమైన వైద్యం అందించాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా
కడప, ఏప్రిల్ 11
 కరోనా వైరస్ నివారణకు రిమ్స్ ఆసుపత్రి వైద్యుల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం జిల్లా కోవిడ్-19 ఆస్పత్రి( ఫాతిమా మెడికల్ కళాశాల) లో వైద్యులకు పి పి ఈ కిట్స్ ఉపముఖ్యమంత్రి అందజేశారు.    ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకొని మన జిల్లా కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు. ఐఎంఏ అసోసియేషన్ వారు 200 పి పి ఈ కిట్స్ ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ కిట్స్ ధరించి వైద్యులు కరోనా పాజిటివ్ వ్యక్తుల దగ్గరికి వెళ్లి వారికి నాణ్యమైన వైద్య చికిత్స లు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఫాతిమా మెడికల్ కళాశాలలో వివిధ వార్డులు, క్యాంటీన్, ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు మంచి ఆహారం ఇవ్వాలని వైద్యులకు చూచించి ఫ్రూట్స్ అందజేశారు. ఈ ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలున్న వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహించాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలలో ఉండకూడదన్నారు.
 ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts