YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

మరో రెండు వారాలు కొనసాగించండి

మరో రెండు వారాలు కొనసాగించండి

మరో రెండు వారాలు కొనసాగించండి
హైదరాబాద్ ఏప్రిల్ 11
దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ప్రధానమంత్రి నరేంద్రమోడిని కోరారు. అయితే, లాక్ డౌన్ సమయంలో ఒకవైపు రైతులు నష్టపోకుండా, మరోవైపు ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సంబధిత పరిశ్రమలు నడిచేలా చూడాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి  కేసీఆర్ పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ కొనసాగించాలన్న ముఖ్యమంత్రి  ప్రజల జీవితాలకు, వ్యవసాయానికి, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తున్నది. ప్రధాని  కూడా ఎప్పటికప్పుడు  మాట్లాడుతున్నారు. మీరు అండగా నిలవడం మాకు ఎంతో మనోధైర్యం ఇస్తోంది. కరోనాపై జరిగే యుద్ధంలో భారతదేశం  తప్పక  గెలిచితీరుతుందని కేసీఆర్ అన్నారు.  లాక్ డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో బాగా ఉపయోగపడింది. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించడం మంచింది. వైరస్ వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదని అయన ప్రధానికి చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గోన్నారు.

Related Posts