YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రెడ్ జోన్లకే లాక్ డౌన్

రెడ్ జోన్లకే లాక్ డౌన్

రెడ్ జోన్లకే లాక్ డౌన్
అమరావతి ఏప్రిల్ 11
శనివారం నాడు ప్రధాని నరేంద్ర  మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  ఏపీ సీఎం  జగన్ మోహన్ రెడ్డి పాల్గోన్నారు.  లాక్ డౌన్ పై జగన్ తన అభిప్రాయాన్ని మోదీకి చెప్పారు. సీఎం జగన్ మాట్లాడుతూ, మీ నాయకత్వ లక్షణాలపై తమకు పూర్తి  విశ్వాసం ఉందని చెప్పారు. మీరు సూచించిన వ్యూహంతోనే ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నామని చెప్పారు. తన అభిప్రాయంగా రెడ్ జోన్లకే లాక్డౌన్ను పరిమితం చేయాలని చెప్పారు. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలని కోరారు. మిగతా ప్రాంతాల్లో భౌతికదూరం పాటించాలన్నారు. ఏపీలో  141 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించామని తెలిపారు.  37 మండలాలు రెడ్ జోన్ల  ఉన్నాయని, 44 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయని, 595 మండలాలు గ్రీన్ జోన్  ఉన్నాయని మోదీకి జగన్ వివరించారు. దాదాపు 30 వేల మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.

Related Posts