మెక్సికోలో నిలబడే ప్రసవం
న్యూయార్క్, ఏప్రిల్ 11
నొప్పులు వస్తున్నాయ్. నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లండి ప్లీజ్’’ అని ఆ గర్బిణీ ఎంత మొత్తుకున్న ఆ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె నిలబడే బిడ్డకు ప్రసవించింది. ఈ దారుణ ఘటన అమెరికా-మెక్సికో సరిహద్దులో చోటుచేసుకుంది. 27 ఏళ్ల గ్యూటేమాలన్ అనే మహిళ, తన భర్తతో కలిసి షులా విస్తా వద్ద సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.అదే సమయంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో తనని హాస్పిటల్‌లో చేర్చాలని కోరింది. అయితే, సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా ఆమెను తమ ఆఫీసులో కుర్చోబెట్టారు. భర్త తన వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను అధికారులకు చూపిస్తుండగా.. లోపల నుంచి ఆమె కేకలు వినిపించాయి.పరుగు పరుగున వెళ్లి చూసిన భర్తకు ఆమె నిలబడే బిడ్డను కనడం కనిపించింది. అప్పటికీ ఆమె ఫ్యాంటు ధరించే ఉంది. దీంతో భర్త వెంటనే ఆమె ఫ్యాంటు కిందకి లాగి బిడ్డను ఒడిసిపట్టుకున్నాడు. లేకపోతే ఆ బిడ్డ కింపడిపోయేది. నొప్పులు భరించలేక బయటకు నడుచుకు వస్తుండగా ప్రసవం జరిగిపోయిందని ఆమె పేర్కొంది. దీంతో అధికారులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అమెరికా మెక్సికోలోని వలసదారులు ఎదుర్కొనే దారుణ పరిస్థితులకు ఈ ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే.