YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మళ్లీ సోకుతున్న వైరస్.. ప్రపంచానికి కొత్త సవాల్

కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మళ్లీ సోకుతున్న వైరస్.. ప్రపంచానికి కొత్త సవాల్

కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మళ్లీ సోకుతున్న వైరస్.. ప్రపంచానికి కొత్త సవాల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11
ఒక్కసారి కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కోవిడ్ రాదని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని పరిశోధనల్లో మాత్రం కరోనా వైరస్ సోకినవారి శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయని తేలింది. అయితే, వీటికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న 91 మందికి మళ్లీ కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్‌ రావడం కలకలం రేగుతోంది.కరోనా నుంచి కోలుకున్న వారికి ఇతరుల నుంచి వైరస్ సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని ఆ దేశ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ సెంటర్స్ డైరెక్టర్‌ జియాంగ్‌ ఇయున్‌ క్యెయాంగ్‌ వ్యాఖ్యానించారు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకావడం లేదని, దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. కొవిడ్‌ సోకినవారిలో యాంటీబాడీలు వృద్ధిచెంది రోగనిరోధక శక్తి పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. కానీ, వీరు మళ్లీ వైరస్‌ బారినపడటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.రెండోసారి కొవిడ్‌ సోకిన వారి సంఖ్య దక్షిణ కొరియాలో సోమవారం నాటికి 51గా ఉండగా ప్రస్తుతం 91కి చేరింది. ఆ దేశంలో మొత్తం 10,480 మంది వైరస్ బారినపడగా 7,200 మందికిపైగా కోలుకున్నారు. రెండోసారి కరోనా వైరస్ సోకినవారి సంఖ్య పెరుగుతోందని, 91 అనేది ఇప్పుడే మొదలైందనడానికి నిదర్శనమని కొరియన్‌ యూనివర్సిటీ గురో ఆస్పత్రి అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ కిమ్‌ వూ జూ అన్నారు. బహుశా వైరస్‌ తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, రక్త నమూనా పరీక్షల్లో కొందరి ఫలితాలు తప్పుగా వచ్చాయేమోనన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. కోలుకున్నవారిలోనూ వైరస్‌ అవశేషాలు ఉంటాయని పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇతరులకు సంక్రమించకపోవచ్చని.. ఇవి అంత ప్రమాదకరం కాకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభిన్న వ్యత్యాసాలు, పలు సందేహాలు ఉన్నాయని హలామ్ యూనివర్సిటీ సెక్రెడ్ హార్ట్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ జుంగ్ కి సుక్ అన్నారు. ఏదేమైనప్పటికీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఒక్కసారి వైరస్ వచ్చిన తర్వాత మళ్లీ సోకుతుందా? అప్పటికే శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయా? వైరస్‌ను నిద్రాణ స్థితిలోనే ఉంచుతాయా? ఇతరులకు సోకినా ప్రమాదం ఉండదా? ప్రస్తుతం వైద్యులు, పరిశోధకులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారి శరీరం నుంచి యాంటీబాడీలను సేకరించి, కోవిడ్-19 చికిత్సకు వినియోగించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. దీనినే ప్లాస్మా చికిత్స అంటారు. ఆస్ట్రేలియాలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టారు. మన దేశంలో కేరళ కూడా ఈ చికిత్సా విధానంపై ఆసక్తి చూపుతోంది. అయితే, దీనికి ఐసీఎంఆర్ అనుమతించాలి.
 

Related Posts