YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

13 అడుగుల వరకు వ్యాప్తి చెందుతున్న కరోనా

13 అడుగుల వరకు వ్యాప్తి చెందుతున్న కరోనా

13 అడుగుల వరకు వ్యాప్తి చెందుతున్న కరోనా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనిషికి మనిషికి మధ్య కనీసం మీటరు నుంచి రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ఓ తాజా సర్వేలో ఆ దూరం సరిపోదని, కరోనా వైరస్ అంచనా వేసిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తోందని తేలింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సామాజిక దూరం వల్ల కోవిడ్-19 వైరస్‌ సోకకుండా నియంత్రించడం సాధ్యమా అనే అంశంపై చైనా పరిశోధకులు చేసిన అధ్యయన వివరాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)కు చెందిన ‘ఎమర్జింగ్ ఇఫెక్షియస్ డిసీజెస్‌’లో ఈ వివరాలను వెల్లడించారు. బీజింగ్‌కు చెందిన అకాడమీ ఆఫ్ మిలట్రీ మెడికల్ సైన్సెస్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో నిపుణులు కోవిడ్-19 రోగులను భర్తీ చేసిన ఐసీయూ విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఉహాన్‌లోని హౌషేన్షా హాస్పిటల్‌లోని రోగులు చికిత్స పొందుతున్న ప్రాంతంలోని నేల, గాలిలో శాంపిళ్లు సేకరించారు. ఈ వైరస్ గాల్లో కంటే నేలపైనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోగులు తుమ్మడం లేదా దగ్గడం వల్ల ఉమ్మితోపాటు వైరస్ బయటకు రావడం వల్ల అవి నేలపైనే ఉంటున్నట్లు కనుగొన్నారు. రోగి తుమ్మిన సందర్భంలో అవి ఆ గదిలో సుమారు 13 అడుగులు(4 మీటర్లు) వరకు విస్తరిస్తున్నట్లు తెలుసుకున్నారు.అలాగే ఐసీయూలో ఉన్న కంప్యూటర్లు, మౌస్, చెత్త బుట్టలు, మంచం కోళ్లు, తలుపు గొళ్లాలపై సైతం వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది షూపై కూడా వైరస్ ఉన్నట్లు తెలుసుకున్నారు. చూశారుగా.. ఇతరులకు వీలైనంత దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా, తుమ్ములు, దగ్గులతో బాధపడే రోగులకు సమీపంలో ఉండకపోవడమే ఉత్తమం

Related Posts