YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 శవాల దిబ్బగా న్యూయార్క్

 శవాల దిబ్బగా న్యూయార్క్

 శవాల దిబ్బగా న్యూయార్క్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11
కోవిడ్-19 అమెరికాను అతలాకుతలం చేస్తోంది. మరణాల్లో ఇప్పటికే చైనా, ఇటలీలను దాటిపోయిన అమెరికా.. కొత్తగా మరో సమస్యలను ఎదుర్కొంటోంది. చనిపోయిన కరోనా రోగులను పూడ్చి పెట్టేందుకు స్మశానాలు ఖాళీ లేకపోవడంతో చరిత్రాత్మక హార్ట్ దీవికి తరలిస్తోంది. అక్కడే భారీగా గోతులు తీసి శవాలను పాతిపెడుతోంది.అమెరికాలో అత్యధిక మరణాలు న్యూయార్క్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. యూఎస్‌లో ఇప్పటివరకు 4,67,000 కరోనా కేసులు నమోదు కాగా, 16,700 మంది చనిపోయారు. మొత్తం కేసుల్లో 1,62,000 మంది న్యూయార్క్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఇక్కడే 7,844 మంది చనిపోయారు. దీంతో స్థానిక స్మశానాలన్నీ మరణించిన కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. అంత్యక్రియలు జరిపేందుకు సుమారు వారం రోజులు వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అంత్యక్రియలు జరిపేందుకు ముందుకురాని కుటుంబికులు: కోవిడ్ 19తో చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలకు ముందుకొచ్చే కుటుంబ సభ్యులకు ప్రభుత్వం శవాలను పూర్తిగా ప్యాక్ చేసి అప్పగిస్తోంది. అనాథ శవాలకు మాత్రమే ప్రభుత్వం సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది. బాధకరమైన విషయం ఏమిటంటే.. న్యూయార్క్‌లోని చాలామంది కోవిడ్ రోగుల కుటుంబికులు శవాలను తమతో తీసుకెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వంపై భారం పడుతోంది.చారిత్రక ‘హార్ట్’ దీవిలో అంత్యక్రియలు: వేల సంఖ్యలో శవాలను సామూహికంగా ఖననం చేసేందుకు అమెరికా ప్రభుత్వం న్యూయార్క్ సమీపంలోని హార్ట్ దీవిని ఎంచుకుంది. న్యూయార్క్‌లో ఎప్పటి నుంచో ఈ దీవిని స్మశాన వాటికలా వాడుతున్నారు. 131 ఎకరాల్లో విస్తరించిన ఈ దీవిలో ఇప్పటివరకు సుమారు ఒక మిలియన్ శవాలను పూడ్చిపెట్టారు. ఒకప్పుడు ఈ దీవిలో రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలను బంధించేవారు.1966 వరకు దీన్ని జైలులాగే వినియోగించారు. ఆ తర్వాత డ్రగ్ రిహాబిలేషన్ సెంటర్‌గా మార్చారు. ఆ తర్వాత దీన్ని కూరగాయల తోటలుగా, బేస్ బాల్ గేమ్స్ కేంద్రంగా ఉపయోగించారు. ఆ తర్వాత దీన్ని నివాస కేంద్రంగా మార్చాలని ప్రయత్నించారు. ఆ తర్వాత ఎన్నో మార్పులు చేయడానికి ప్రయత్ని విఫలమయ్యారు. చివరికి 1985లో తొలిసారిగా ఎయిడ్స్ రోగులను ఖననం చేయడానికి ఈ దీవిని ఉపయోగించారు. ఆ తర్వాత అంటువ్యాధులతో చనిపోయే వ్యక్తులను ఇక్కడే పూడ్చడం మొదలుపెట్టారు. ఇప్పుడు కోవిడ్-19తో చనిపోయినవారిని పూడ్చేందుకు ఈ దీవిని ఎంచుకున్నారు.ఖైదీలకు బదులు కాంట్రాక్ట్ కూలీలు: ఇప్పటివరకు ఈ దీవి వారానికి ఒకసారి మాత్రమే తెరిచి ఉండేది. వారంలో సుమారు 24 శవాలను పూడ్చిపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా వైరస్ వల్ల రోజుకు కనీసం 25 శవాలను ఇక్కడికి తరలిస్తున్నారు. వాటన్నింటినీ చెక్క పెట్టెల్లో పెట్టి పూడ్చిపెడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ శవాలను ఖననం చేసే పనులను ఖైదీలు మాత్రమే చేసేవారు. మరణాల సంఖ్య పెరగడంతో ఈ పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారు. ప్రొక్లయినర్లతో భారీగా గోతులు తీసి శవాలను ఇక్కడ పూడ్చిపెడుతున్నారు. ఈ కింది డ్రోన్ వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు

Related Posts