YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎక్కడా కనిపించని ప్రైవేట్ వైద్యులు

ఎక్కడా కనిపించని ప్రైవేట్ వైద్యులు

 ఎక్కడా కనిపించని ప్రైవేట్ వైద్యులు
గుంటూరు, ఏప్రిల్ 13
యుద్ధం వచ్చినప్పుడు సైనికుడు చనిపోవచ్చు. అది సహజం. యుద్ధ లక్ష్యం శత్రుసైన్య వినాశం, విచ్చిన్నం. అలాంటి సమయంలో మన సైనికులకు ప్రభుత్వం సరైన ఆయుధాలు ఇవ్వలేదు అని మాట్లాడం. అలా మాట్లాడితే దేశద్రోహం అవుతుంది. ఇప్పుడు కరోనా అలాంటి పరిస్థితినే తెచ్చింది. ఇది వైద్య యుద్ధం. ఈ యుద్ధంలో సైనికులకు (వైద్యులకు) ఎలాంటి ఆయుధాలు సమకూర్చాం అన్నది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదు. ఈ యుద్ధంలో ఎందరు సైనికులు చనిపోతున్నారు అన్నది కూడా మాట్లాడవలసిన అంశం కాదు. అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ విషయాలు యధేచ్చగా మాట్లాడేస్తున్నారు.ఇది ఊహించని యుద్ధం. అంచనా వేయలేని శతృవు (వైరస్) కళ్ళముందు కనిపిస్తుంటే శతృవును ఎదుర్కొనే ఆయుధాలు చేతిలో లేకుండానే యుద్ధం చేయాల్సి వస్తోంది. యుద్ధరంగంలో సైనికులు ఉన్నసమయంలో ఆయుధాల తయారీ మొదలైన సందర్భం ఇది. ఈ వాస్తవాలను వదిలేసి రాజకీయాలు మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చెల్లింది. ఇలాంటి రాజకీయాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ వినిపించడం లేదు.ఇక ఈ యుద్దాన్ని ప్రభుత్వ వైద్య బృందాలు మాత్రమే చేస్తుండడం, ప్రైవేటు వైద్యులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిత్యం వందలమంది పేషంట్లతో కళకళ్ళాడుతూ ఉండే ప్రవేటు ఆస్పత్రులు ఇప్పుడు మూతపడ్డాయి. ఒక్క ప్రైవేటు ఆస్పత్రి, ఒక్క ప్రవేటు వైద్యుడు ఈ యుద్ధంలో భాగస్వామి కాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు “ఐసోలేషన్” కేంద్రాలకోసం, “క్వారంటైన్” కేంద్రాలకోసం వెతుకులాడుతుంటే, ప్రవేటు ఆస్పత్రులు “లాక్ డౌన్” ప్రకటించి తలుపులేసుకున్నాయి.మాస్కులకోసం, గ్లవుజులకోసం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుంటే ప్రైవేటు వైద్యులు చోద్యం చూస్తున్నారు. మాస్కులు, గ్లవుజులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలానే ఉంటాయి. అవి మాత్రమే సరిపోతాయని కాదు. కానీ అవికూడా బయటకు తీస్తే మంచిది కదా! వేలు, లక్షలు, కోట్లు గడిస్తున్న ఈ ఆస్పత్రులు, వైద్యులు కనీస సామాజిక బాధ్యతగా ముందుకు రాకపోవడం, బాధ్యత మొత్తం ప్రభుత్వ వైద్యుల భుజస్కందాలపై వేసి చేతులు దులిపేసుకోవడం సామాజిక బాధ్యత అవుతుందా?ఏ ప్రజలనుండి అయితే ఇన్నేళ్ళుగా డబ్బులు పోగేసుకున్నారో ఆ ప్రజలు ఇప్పుడు కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నపుడు, ఆ ప్రజల ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ప్రైవేటు వైద్యులు కానీ, ప్రైవేటు ఆస్పత్రులు కానీ ముందుకు రాకపోవడం సామాజిక ద్రోహం అవుతుంది. యుద్ధం సైనికుడి బాధ్యత మాత్రమే కాదు. యావత్ ప్రజల భాగస్వామ్యం అవసరం. ఇప్పుడు కరోనపై యుద్ధం కూడా ప్రభుత్వ వైద్య బృందాల బాధ్యత మాత్రమే కాదు. దేశంలోని యావత్ వైద్య రంగం ప్రజలకోసం పనిచేయాల్సిన సమయం. ఈ క్లిష్ట సమయంలో ప్రైవేటు వైద్యరంగం లాక్ డౌన్ ప్రకటించడం ద్రోహం అవుతుంది.

Related Posts