YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఇళ్లకే పరిమితమైన 85 శాతం వాహానాలు

ఇళ్లకే పరిమితమైన 85 శాతం వాహానాలు

 

  ఇళ్లకే పరిమితమైన 85 శాతం వాహానాలు
హైద్రాబాద్, ఏప్రిల్ 13
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కరోనాను కట్టడి చేయాలంటే అందరూ ఇంట్లోనే ఉండాల్సిన సమయం. ఎప్పుడూ రోడ్లపై రద్దీగా కనిపించే వాహనాలన్నీ ఇంటికి పరిమితయ్యాయి. ఒకవైపు కరోనా భయం.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలతో బయటకు తీయాలంటేనే బయపడిపోతున్నారు. చాలామంది అత్యవసరమైతే తప్పా బైకులు, కార్లను బయటకు తీయడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో సుమారుగా 55 లక్షల వాహనాల్లో 85 శాతం ఇళ్లకే పరిమితమయ్యాయి. లాక్ డౌన్ మరికొన్నిరోజులు పొడిగించే అవకాశం ఉంది.నెలల తరబడి ఇంట్లోనే బండ్లను పార్క్ చేసి ఉంచితే.. వావానాల సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా కొంతసేపు అయినా వాహనాలను బయటకు తీయాలని అంటున్నారు. లేదంటే.. వాహనాల్లోని ఇంజిన్, బ్యాటరీ, బ్రేకులు, టైర్లు దెబ్బతినే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. వాహనాలు బయటకు తీయనప్పుడు.. పెట్రోల్, డీజిల్ పోయడమెందుకులే అని అనుకుంటారు. ఇందనం ఆదా అవుతుందని అంటుంటారు. రోజుల తరబడి వాహనాలు నడపకుండా ఉంటే తుప్పు పట్టే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ముఖ్యంగా బ్యాటరీలు దెబ్బతినే అవకాశం ఉంది. బ్యాటరీ సరిగా పనిచేస్తేనే వాహనాలు సెల్ఫ్ స్టార్ట్ అవుతాయని అందరికి తెలుసు.. బ్యాటరీ పనిచేయకపోతే.. వాహనం పికప్ సరిగా ఉండదు.. వెంటవెంటనే ఆగిపోతుందని విషయం వాహనదారులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా కనీసం కిలోమీటర్ దూరం వరకు నడిపి ఆ తర్వాత ఇంట్లోనే పార్క్ చేయడం చేస్తుండాలి.ఒకవేళ లాక్ డౌన్ నిబంధనల కారణంగా బయటకు బండి తీసే పరిస్థితి లేదంటే.. ఇంటి ఆవరణంలోనే కాసేపు బండిని అటు ఇటు తిరగడం లేదా ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచడం చేయాలి. కొత్త వాహనాల్లో అయితే కాస్త బ్యాటరీ పనితీరు మెరుగ్గానే ఉంటుందని.. ఏడాది దాటితే బ్యాటరీల పనితీరు మందగిస్తుంది.. వెంటనే బ్యాటరీలు చెడిపోయే అవకాశం ఉంది. బ్యాటరీలు చెడిపోతే గ్యాస్ డిశ్చార్చి అయిపోతుంది. అంతేకాదు.. ప్రతిరోజు వాహనాన్ని శుభ్రంగా తుడవడం ద్వారా తుప్పు, మరకలు వంటి లేకుండా జాగ్రత్త పడొచ్చు. వాహనాలను ఒకే చోట ఎక్కువ రోజులు నిలిపి ఉంచడం కూడా మంచిది కాదు.. ఆ వాహనం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఒకే చోట పార్క్ చేయడం ద్వారా వాహనంలోకి ఎలుకలు, బొద్దింకలు, ఇతర క్రిమికీటకాలు చేరొచ్చు. ఇంజిన్ కంపార్ట్ మెంట్లో వైర్లను కొరికే ప్రమాదం ఉంది. తెగిపోయిన వైర్ల కారణంగానే విద్యుత్ షార్ట్ సర్య్కూట్ అవుతుంది. అందుకే ఒకసారైన బాయ్ నెట్ తెరిచి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ లెవల్స్ కూడా చెక్ చేయించుకోవాలి. వాహనాల సామర్థ్యాన్ని కూడా తెలుసుకోవాలి. టైర్ల నాణ్యత ఎలా ఉంది? గాలిపీడనం  ఎలా ఉందో చెక్ చేయాలి. కార్లలో హ్యాండ్ బ్రేక్ జామ్ అవ్వొచ్చు. బైక్ లో అయితే పెట్రోల్ ఆఫ్ చేయాలి. ఇందనం ఓవర్ ఫ్లో అయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించాలి. బ్యాటరీతో నడిచే వాహనాలను రోజులో కొంతసేపు అయినా బయటకు తీసి నడపాలి. ద్విచక్ర వాహనాలను స్టార్ట్ చేసేటప్పుడు తొలుత సెల్ఫ్ సార్ట్ కంటే కిక్ స్టార్ట్ చేయడం చేయాలి. బండ్లను ఎండలో ఉంచకండి.. ఇందనం వేడికి ఆవిరయ్యే అవకాశం ఉంది. టైర్లలో గాలి కూడా పోతుంది. వాహనాలపై దుమ్మదూళి చేరకుండా ఉండేందుకు కవర్లను కప్పి ఉంచాలి

Related Posts