YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

1500లకు కరోనా టెస్ట్

1500లకు కరోనా టెస్ట్

1500లకు కరోనా టెస్ట్
హైద్రాబాద్, ఏప్రిల్ 13
కరోనా నిర్ధారణ పరీక్షలు ఇకపై అతికొద్ది గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటలోపే కరోనా నిర్ధారణ చేయొచ్చు. కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టు కిట్లను హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసింది. అంకుర కంపెనీ హ్యువెల్ లైఫ్ సైన్సెస్ తక్కువ ధరకే కరోనా నిర్ధారణ కిట్‌ను డెవలప్ చేసింది. రూ.1500 ఖర్చుతో కేవలం రెండున్నర గంటల్లోనే టెస్టు రిజిల్ట్స్ తెలుసుకోవచ్చునని వెల్లడించింది.ఈ కంపెనీ రూపొందించిన టెస్ట్ కిట్లకు ICMR ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ టెస్టు కిట్లను భారీగా డెవలప్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కిట్ల కొరత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం సైతం ఈ కంపెనీని సంప్రదించింది. అతి త్వరలో కిట్ల ప్రొడక్షన్ ప్రారంభించనట్టు సంస్థ వ్యవస్థపాకుడు డాక్టర్ శిశిర్ తెలిపారు. కరోనా నిర్ధారణ టెస్టులను ఆర్ టీ పీసీఆర్ పై నిర్వహిస్తున్నారు. దీనికి అవసరమైన కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ తోపాటు ఆ దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో టెస్ట్ కిట్ల కొరత ఏర్పడిందని తెలిపారు. టెస్టు కిట్లకు అవసరయ్యే కంపోనెంట్స్ దిగుమతి చేసుకోవడంతో ఒక్కో టెస్టు కిట్‌కు రూ.4500 వరకు ఖర్చు అవుతుంది. హ్యువెల్ లైఫ్ సైన్సెస్ కిట్‌లో ఉపయోగించే రెండు రకాల ఎంజైమ్స్, బఫర్స్, ప్రైమర్స్ అన్ని దేశీయంగా సమకూర్చడంతో స్వల్ప వ్యయంతోనే టెస్టు కిట్లను తయారుచేసుకోవచ్చునని చెప్పారు. ఒక్కో టెస్టు కిట్ కు దాదాపు వంద వరకు టెస్టులకు వాడొచ్చు. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షకు కేవలం రూ.1500లోపే చేసుకోవచ్చునని పేర్కొంది. రియల్ టైమ్ పీసీఆర్ పైన ఈ కరోనా టెస్టును నిర్వహిస్తారు. RNA ఆధారిత టెస్టుగా పిలుస్తారు. గొంతు, ముక్కు లోపల నుంచి కఫం తీసి పరీక్షిస్తారు. రెండున్నర గంటల్లోనే రిజిల్ట్స్ తెలుసుకోవచ్చు. కరోనా వైరస్ తో పాటు SARS ఆధారిత వైరస్ ల నిర్ధారణకు కూడా ఈ టెస్టు కూడా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. కాగా, ఎంజైమ్స్, బఫర్స్ సిద్ధంగా ఉండటంతో కిట్లను 20 నుంచి 25 రోజుల్లో అభివృద్ధి చేశామన్నారు. ఇందుకోసం నార్సింగిలోని తమ కార్యాయలంలో 21 మంది పనిచేసినట్టు తెలిపింది.

Related Posts