YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

జిల్లాల్లోఆర్ఎంపీ డాక్టర్లే దిక్కు

జిల్లాల్లోఆర్ఎంపీ డాక్టర్లే దిక్కు

జిల్లాల్లోఆర్ఎంపీ డాక్టర్లే దిక్కు
కరీంనగర్, ఏప్రిల్ 13
జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లికి  చెందిన ఓ 60 ఏళ్ల మహిళ కొద్ది రోజులుగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతోంది.  ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో చూపించగా 8 ఎంఎం సైజు రాయి ఉంది.. కొద్ది రోజుల తర్వాత ఆపరేషన్‌ ‌చేస్తామని, అప్పటి వరకు ఈ మందులు వాడమని చెప్పి పంపించారు. ఇప్పుడా మహిళ వద్ద మందులు ఆయిపోయాయి. ఆపరేషన్‌‌ ‌‌చేయించుకుందామని చూస్తుంటే ఆ హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. వారం రోజులుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది.. ప్రస్తుతం స్థానిక ఆర్‌ఎంపీకి చూపించుకోగా అతడు ఇచ్చిన నొప్పి నివారణ మందులు వాడుతుంది. ములుగుకు చెందిన ఓ మహిళ కొద్ది రోజుల క్రితం హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకుంది. నెల రోజుల తర్వాత వచ్చి చూపించి మళ్లీ మందులు తీసుకోవాలని అప్పుడు ఆపరేషన్‌‌చేసిన డాక్టర్ చెప్పారు. నెల రోజులు దాటింది. హాస్పిటల్ కు ఫోన్ చేస్తే మీరు ఇప్పుడు రావద్దు..”అని హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నట్లుగా ఆ మహిళ వాపోయింది. లాక్‌‌‌‌డౌన్‌ ‌సమయంలో హాస్పిటళ్లు, క్లినికల్ ల్యాబ్ లు,   మెడికల్‌‌‌‌ షాపులు తెరిచే ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు సూచించినా ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ హాస్పిటళ్లన్నీబంద్ చేసే ఉంటున్నాయి. ఓపీ పూర్తిగా ఆపుచేసి హాస్పిటల్ యాజమాన్యాలు డాక్టర్లు, నర్సులకు సెలవులిచ్చాయి. దీంతో ఎమర్జెన్సీ ఆపరేషన్లు మినహా మిగతా వైద్య సేవలన్నీ కూడా పూర్తిగా బంద్‌‌‌‌ చేయడంతో వేలాది రోగులు ఇబ్బందులు పడుతున్నా రు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో హాస్పిటళ్లకు  వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 450 కి మించి ప్రైవేట్‌ హాస్పిటళ్లు, 40కి పైగా ఆరోగ్య శ్రీ హాస్పిటళ్లు ఉన్నాయి. 1,800 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. పెద్ద రోగం వచ్చినా.. పెద్ద, పెద్ద హాస్పిటల్స్‌‌‌‌, ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలు కరోనా వైరస్‌ ‌‌‌వ్యాపిస్తుందనే కారణంతో ఓపీలు బంద్‌‌ చేశాయి. హాస్పిటల్‌‌‌‌కు వచ్చిన పేషెంట్ చేయి పట్టుకొని పరీక్షించడం, బీపీ చూడటం, నోరు చాపి నాలుక చూడటం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ఇలా చేస్తే పేషెంట్ల ద్వారా తమకు కూడా కరోనా వచ్చే ఆస్కారం ఉందని చాలా మంది డాక్టర్లు హాస్పిటల్స్‌‌‌‌కు వెళ్లటం లేదు. ఓపీ చూడటం లేదని రోగులు చెబుతున్నారు. దీంతో ఎంత పెద్ద రో గం వచ్చినా తగ్గటానికి తమ గ్రామాల్లో ఉన్న ఆర్‌ఎంపీలనే సంప్రదిస్తున్నట్లుగా వివరిస్తున్నారు

Related Posts