YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నష్టపోయిన పంటలను అంచనా వేసి ఆదుకోవాలి: కోదండ రెడ్డి

నష్టపోయిన పంటలను అంచనా వేసి ఆదుకోవాలి: కోదండ రెడ్డి

 నష్టపోయిన పంటలను అంచనా వేసి ఆదుకోవాలి: కోదండ రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 13
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగాళ్లతో ఇటీవల 30 వేల ఎకరాలలో వరి, మొక్క జొన్న, టమాటా, మామిడి పంటలు నష్టాల పాలయ్యాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. కోదండ రెడ్డి..పేర్కొన్నారు. గాంధీ భవన్ లో మేడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వ జి.ఓ 1 ప్రకారం పంటలను నష్టం అంచనా వేసి పంట నష్ట పరిహారం కల్పిస్తారని ఆశ పడ్డారు. కాని నిన్న జరిగిన మంత్రి వర్గం సమావేశంలో ఏ రకమైన హామీ రాక పోవడం దురదృష్టకరమన్నారు.ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పంటలు కళ్ళ ముందు పాడవుతుంటే రైతులు తీవ్ర మనో వేదనకు గురవతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.ఆర్థిక మంత్రి, మంత్రులు, ఎమ్యెల్యేలు, టిఆర్ఎస్ నాయకులు పంటలు పాడైన పొలాల్లో ఫోటోలకు పోజులు ఇచ్చారు తప్ప ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి మేలు చేయలేదన్నారు.గత నాలుగు ఏళ్లుగా రైతులు ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే ముఖ్యమంత్రి స్పందించి రాష్ట్రంలో ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన పంటలను అంచనా వేసి ఆదుకోవాలని కోదండ రెడ్డి..డిమాండ్ చేశారు..
 

Related Posts