నిబంధనలు మీరి రోడ్డు ఎక్కితే చర్యలే
డిసిపి ప్రకాష్ రెడ్డి
రంగారెడ్డి ఏప్రిల్ 13
.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మీరి ఎవ్వరు రోడ్లమీడికి వస్చిన తాట తిస్తామని శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ డిసిపి పరిధిలోని చేవెళ్ల మోయినాబాద్, నర్సింగి, ఆరాంగర్, రాజేంద్రనగర్, గగన్ పహాడ్, శంషాబాద్, తొండూపల్లి, అత్తాపూర్, రాళ్లగూడా, పాలమాకుల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అయన తెలిపారు. కరోన కట్టడి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ ఉందన్నారు. అనవసరంగా రోడ్లమీదకి ఎవ్వరు వచ్చినా వాహనాలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు 1200వాహనాలు సీజ్ చేసి పలువురిపై కేసులో నమోదు చేశామన్నారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చి చిక్కుల్లో పడోదన్నారు. రాష్ట్రంలో కరోన కేసులు పెరుగుతున్నాయని అందుకు ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు రావడమే కారణమని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులతో సహకరించాలని సూచించారు. నేటినుంచి లాక్ డౌన్ ముగిసేవరకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రోడ్లమీద తిరిగి జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై అవసరమైతే పిడి యాక్ట్ నమోదు చేసేందుకు వెనుదియమన్నారు. దయచేసి ప్రజలు కరోన పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండలని అన్నారు.