YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబు దళిత ద్రోహి

 చంద్రబాబు దళిత ద్రోహి

 చంద్రబాబు దళిత ద్రోహి
తాడేపల్లి ఏప్రిల్ 13 
కరోనా కట్టడికి రాష్ర్టప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలో టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.  కరోనా కట్టడికి ఇంటింటికి సర్వే చేస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకరబాబు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వంపై చంద్రబాబు కావాలని బురదచల్లుతున్నారు. క్లిష్టపరిస్దితులలో కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని దుష్ర్ర్పచారం చేస్తున్నారు. కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు తొత్తుగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించారు. డబ్బులు,మద్యం లేకుండా స్దానికసంస్ధల ఎన్నికలను నిర్వహించాలని  వైయస్ జగన్ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.  దానిని సైతం విమర్శలు చేసే విధంగా నిమ్మగడ్డ రమేష్ కేంద్రానికి లెటర్ రాశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అవమానించేవిధంగా భాషవాడారని అన్నారు. రాష్ట్రగవర్నర్ గారి ద్వారా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా న్యాయకోవిదుడైన కనగరాజ్ గారిని ముఖ్యమంత్రి నియమించారు. సీనియర్ జడ్జి  కనగరాజ్ ను ఎస్ ఇ సి గా నియమిస్తే విమర్శలు చేస్తారా. ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతున్నారు.లెటర్ లు రాస్తున్నారు. దళితులు ఎన్నికల కమీషనర్ గా ఉండకూడదా అని అయన ప్రశ్నించారు. రమేష్ కుమార్ నే ఎస్ ఇ సి గా ఉండాలని చంద్రబాబు, టిడిపి నేతలు ఎందుకు కోరుకుంటున్నారు. చంద్రబాబు మొదటినుంచి దళితద్రోహి. -స్దానికసంస్ధల ఎన్నికలలో ఏకగ్రీవం అయిన వాటిలో 80 శాతంకు పైగా వైయస్సార్ కాంగ్రెస్  ఏకగ్రీవం చేసుకుందని ఓర్వలేకపోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ ప్రజాప్రతినిధులను అవమానించారు. -నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడనే అంశంపై మేం కూడా కోర్టుకు వెళ్తామని అన్నారు.

Related Posts