కరోనా నియంత్రణకు కఠిన చర్యలు
- జిల్లా కలెక్టర్
కామారెడ్డి లో రక్తదాన శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్.
మాస్కులు ధరించకుంన్నా, ఉమ్మి వేసినా కటకటాల వెనక్కి
కామారెడ్డి ఏప్రిల్ 13
కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వివిధ మండలాల అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మద్నూరు సరిహద్దులోని రోడ్లను మూసి ఉంచాలని సూచించారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయి లో తాసిల్దార్ , ఎస్సై పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల వచ్చిన వారిని కారంటైను లో ఏప్రిల్ 21 వరకు కచ్చితంగా ఉండేవిధంగా అధికారులు చూడాలని కోరారు. రోడ్ల పై ఉమ్మి వేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వలస కార్మికులకు భోజనం అందించాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ అధికారులు చూడాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. లాకుడౌను కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ శ్వేతా కోరారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వాహనాలను అనుమతించవద్దని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ లు యాదిరెడ్డి, వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డి పి ఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.