YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి

 రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి

 రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి
న్యూఢిల్లీ ఏప్రిల్ 13
రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అయన సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసారు. ముస్లీంలు తమ ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను వారి వారి  ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు. దేశంలో  స్టేట్ వక్ఫ్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా నఖ్వి ఉన్నారు. 'ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, ఇమాంబాద్, దర్గాలు, ఇతర మత సంస్థలు స్టేట్ వక్ఫ్ బోర్డుల కిందకు వస్తాయి' అని నఖ్వి తెలిపారు. కోవిడ్-19 సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్‌డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఇప్పటికే కోరానని, వారితో మాట్లాడానని నఖ్వి ఆ ప్రకటనలో తెలిపారు. ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలు జరుపుకునేలా చూస్తామని మత పెద్దలంతా తనకు హామీ ఇచ్చారని చెప్పారు. లాక్‌డౌన్‌కు కట్టుదిట్టంగా, సమర్థవంతంగా అమలు చేసే విషయంలో స్థానిక యంత్రాగానికి మత, సామాజిక సంస్థలు, వ్యక్తులు సహకరించాలని మంత్రి కోరారు.

Related Posts