YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

కశ్మీర్‌పై మరో రగడ! భద్రతా మండలి తలుపు తట్టిన పాక్!

కశ్మీర్‌పై మరో రగడ! భద్రతా మండలి తలుపు తట్టిన పాక్!

కశ్మీర్‌పై మరో రగడ! భద్రతా మండలి తలుపు తట్టిన పాక్!
ఇస్లామాబాద్ ఏప్రిల్ 13 
ఓ పక్కన కరోనా మహమ్మారి దేశాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నప్పటికీ పాక్ మాత్రం భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానట్లేదు. కశ్మీర్‌లో జరిగే ప్రతి పరిణామాన్ని అంతర్జాతీయంగా యాగీ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కశ్మీర్‌ స్థానికత నిబంధనల్లో భారత్ ప్రభుత్వం చేసిన మార్పుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండిలికి పాక్ విదేశాంగ శాఖ మంత్రి మఖ్దూమ్ షా మహమూద్ ఓ లేఖ రాసారు. కరోనాతో పోరాడటంలో ప్రపంచ దేశాలు బీజిగా ఉండగా ఈ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది లేఖలో పేర్కొన్నారు. 15 ఏళ్లుగా కశ్మీర్‌లో నివసిస్తున్న వారందరూ అక్కడి ప్రభుత్వోద్యోగాలకు అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన  అక్కడి జనాభాలో పెను మార్పులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అయితే పాక్ ప్రేలాపనలై స్పందించిన భారత అధికారి ఒకరు.. సరైన సమయంలో సరైన రీతిలో భారత్ పాక్‌కు జవాబిస్తుందని తెలిపారు. కాగా.. సరిగ్గా మూడునెలల ముందు పాకిస్థాన్.. కశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ముందుకు తెచ్చింది. చైనా సాయంతో భారత్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా స్థానిక నిబంధనల రూపంలో మరో అవకాశం కనిపించగానే పాక్ మళ్లీ కుటిల చర్యలకు పూనుకుంది. అయితే కరోనా తో ప్రమాదం ఎదుర్కొంటున్న తమకు ప్రపంచ దేశాలు సహాయం చేయాలంటూ ఆదివారం నాడు విజ్ఞాపన చేసిన పాక్ అదే రోజు స్థానికత నిబంధనలపై భద్రతా మండలికి లేఖ రాయడం గమనార్హం.
 

Related Posts