YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశవ్యాప్తంగా సురక్షా స్టోర్స్

దేశవ్యాప్తంగా సురక్షా స్టోర్స్

దేశవ్యాప్తంగా సురక్షా స్టోర్స్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13,
నరేంద్ర మోదీ మరో సంచలనానికి రెడీ అవుతున్నారా? లాక్ డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. లాక్ డౌన్ వల్ల గ్రాసరీ షాప్స్ మినహా మిగతావన్నీ దాదాపుగా క్లోజ్ అయ్యాయి. దీంతో హెయిర్ కటింగ్ కూడా చేసుకోలేకపోతున్నారు. బట్టలు కూడా కొనుగోలు చేయడానికి వీలు లేదు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయంతో ముందుకు రాబోతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నారు. సురక్ష స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 45 రోజుల్లో 20 లక్షల సురక్ష స్టోర్ల ఏర్పాటును కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.మోదీ సర్కార్ సురక్ష స్టోర్ల ఏర్పాటు కోసం ఎఫ్ఎంసీజీ కంపెనీలతో జతకట్టనుంది. అంతేకాకుండా ప్రభుత్వం పేర్కొన్న అర్హతలు కలిగిన కిరాణా స్టోర్లు, గ్రాసరీ స్టోర్లు కూడా సురక్ష స్టోర్లుగా వ్యవహరించడానికి కేంద్రానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం గ్రాసరీ స్టోర్లను మాత్రమే కాకుండా డ్యూరబుల్ కన్సూమర్ ప్రొడక్ట్స్ షాప్స్, వస్త్ర దుకాణాలు, సెలూన్స్ (కటింగ్ షాప్స్) వంటి వాటి వాటిని కూడా సురక్ష స్టోర్ల కిందకు తీసుకురానున్నారు.ఈ షాపుల్లో హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది. అలాగే స్టాఫ్ అందరరికీ మాస్క్‌లు తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ స్కీమ్ అమలు బాధ్యతలను అప్పగించొచ్చు. ఈ కంపెనీలు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని రూల్స్‌ను ఫాలో అవుతాయి. అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం, మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.కాగా సురక్ష స్టోర్ల ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రానికి 50 ఎఫ్ఎంసీజీ కంపెనీల మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక స్కీమ్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్ ప్రాతిపదికన అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ స్కీమ్ అమలుకు కంపెనీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.

Related Posts