YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఢిల్లీ వాసులను భయ పెట్టిన భూకంపం

 ఢిల్లీ వాసులను భయ పెట్టిన భూకంపం

 ఢిల్లీ వాసులను భయ పెట్టిన భూకంపం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13
ఢిల్లీ ప్రజలను భూకంపం మరోసారి భయపెట్టింది. సోమవారం (ఏప్రిల్ 13) మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 2.7 మాగ్నిట్యూడ్ తీవ్రత గల భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లలోని వస్తువులు కుదుపులకు లోనయ్యాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల లోంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాదికి చెందిన పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆదివారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భయంతో ప్రజలు బహిరంగ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ సమీపంలో సార్దాన వద్ద 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.ఆదివారం నాటి భూకంపం కారణంగా ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత చాలా తక్కువగానే ఉన్నా.. ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగాయని ఢిల్లీ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు పోస్టు చేశారు. అసలే కరోనాతో కలవరానికి గురవుతుంటే.. భూకంపం మరింత ఆందోళనకు గురిచేస్తోందని కామెంట్లు పెట్టారు

Related Posts