YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాల కోసం ఎగబడ్డ జనం

పాల కోసం ఎగబడ్డ జనం

పాల కోసం ఎగబడ్డ జనం
బెంగళూర్, ఏప్రిల్ 13, 
క‌రోనా వైర‌స్ వేళ దేశ‌వ్యాప్తంగా 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌లంతా గుమిగూడ‌కుండా, ఎవ‌రి ఇళ్ల‌లో వారే ఉండాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది. భౌతిక దూరాన్ని పాటించ‌డంతోపాటు, ఎవ‌రికి వారే సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని తెలిపింది. అయితే దేశంలోని చాలా చోట్ల లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను కొంత‌మంది పాటించ‌డం లేదు. నిర్ల‌క్ష్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ త‌మ ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఇత‌రుల‌కు థ్రెట్‌గా మారుతున్నారు. తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన సంఘ‌ట‌న షాక్‌కు గురిచేస్తోందిరాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో ప్ర‌భుత్వం ఉచితంగా పాల‌ను పంచుతోందని తెలిసి, జ‌న‌మంతా గుంపులు గుమిగూడారు. బాధ్య‌తాయుతంగా క్యూను పాటించ‌డం మ‌రిచి, ప్యాకెట్ల కోసం ఎగ‌బ‌డ‌టం షాక్‌కు గురిచేస్తోంది. నిజానికి లాక్‌డౌన్ వేళ పేద‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం గొప్ప మ‌నసుతో ఉచిత పాల ప్యాకెట్ల పంపిణీని ప్ర‌క‌టించింది. అయితే పంపిణీలో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది.నగరంలోని రాజాజీ న‌గ‌ర్‌, మంజునాథవార్డులో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వార్త‌లు వివిధ చానెళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యాయి. ఇక క‌ర్ణాట‌క‌లో క‌రోనా వైర‌స్ ఉధృతి కాస్త త‌క్కువ‌గానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 230 మందికిపైగా పాజిటివ్‌గా తేలారు. అలాగే ఆరుగురు మ‌ర‌ణించారు.
 

Related Posts