YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఢిల్లీ వర్చువల్ టూర్

 ఢిల్లీ వర్చువల్ టూర్

 ఢిల్లీ వర్చువల్ టూర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13
భారత దేశంలో ఎన్నో గొప్ప పర్యాటక ఆకర్షణ గల ప్రదేశాలు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు లక్షలాది పర్యాటకులు దేశ విదేశాల నుండి వస్తుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దేశంలో పర్యాటక ప్రదేశాలన్నీ టూరిస్టులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పర్యాటక శాఖ ట్రావెల్ ప్రియుల కోసం ఒక వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను హాయిగా మీ ఇంటి వద్ద సోఫాలో కూర్చుని వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. వీటినే వర్చువల్ టూర్స్ అని అంటారు. ప్రత్యేకమైన విఆర్ గ్లాసెస్ ను కళ్లకు ధరించడం ద్వారా పర్యాటక ప్రదేశాలు మీ కళ్ల ముందే ఉన్నట్లు, మీరు వాటిలో పర్యటిస్తున్నట్లు అనుభూతి చెందవచ్చు. మరి ఢిల్లీలో వర్చువల్ టూర్ అనుభవాలను అందించే ఆ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.ఎర్రకోటను లాల్ క్విలా అని కూడా పిలుస్తారు. ఈ గంభీరమైన కట్టడం పాత ఢిల్లీ నడిబొడ్డున, చాందిని చౌక్ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఈ ఎరుపు ఇసుకరాయి నిర్మాణం 1638 సంవత్సరంలో నిర్మించబడింది. భారత దేశ చరిత్రలో ఇది గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రదేశం ఒకప్పుడు మొఘల్ చక్రవర్తులకు ప్రధాన రాజ నివాసంగా పని చేసింది. నేడు నగరంలో ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. మీరు ఈ కోటను వ్యక్తిగతంగా సందర్శించలేకపోతే వర్చువల్ టూర్ చేయడం ద్వారా ఖచ్చితంగా అన్వేషణ చేయవచ్చు.కుతుబ్ మినార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఇది ఢిల్లీలో ఎక్కువగా సందర్శించే పురాతన నిర్మాణాలలో ఒకటి. ఈ అద్భుతమైన స్మారక చిహ్నం దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఉంది. ప్రతి గంటకు పర్యాటకుల రద్దీ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఎరుపు ఇసుకరాయి మరియు పాలరాయి స్మారక చిహ్నాన్ని 1193లో కుతుబ్-ఉద్-దిన్ ఐలక్ నిర్మించారు. ఈ పొడవైన మినార్ ప్రతి కోణంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఈ నిర్మాణాన్ని తమ ఇంటి వద్ద చక్కగా కూర్చుకుని వర్చువల్ టూర్ ద్వారా వీక్షించవచ్చు.బ్రహ్మాండమైన మొఘల్ గార్డెన్స్ ప్రసిద్ధ రాష్ట్రపతి భవన్ లో ఒక భాగం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ను 1900 లలో సర్ ఎడ్వర్డ లూటియెన్స్ రూపొందించారు. ఈ ఉద్యాన వనాలు ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణను తెచ్చి పెడతాయి. దాదాపు 13 ఎకరాలలో విస్తరించి ఉన్న మొఘల్ గార్డెన్స్ అనేక రకాల పుష్పాలకు నిలయం. ఇవి మార్గాల్లో ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. ఇక్కడ సంగీత, ఆధ్యాత్మిక, బొన్సాయ్ తోటలు కూడా ఉన్నాయి. ఇవి ఫిబ్రవరి నుండి మార్చి వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మీరు కోరుకుంటే వీటిని వర్చువల్ టూర్ ద్వారా ఆస్వాదించవచ్చు.భారత దేశంలో ఉన్న దిగ్గజ స్మారక చిహ్నాల్లో ఇండియా గేట్ ఒకటి. అనేక మంది సందర్శించే ఉత్తమ పర్యాటక గమ్యస్థానం ఈ ప్రదేశం. ఈ స్మారక చిహ్నాన్ని చూడకుండా... అక్కడ ఫోటో దిగకుండా టూరిస్టులకు ఢిల్లీ పర్యటన పూర్తి కాదు. ప్రజలకు ఇది ఎంతో ఇష్టమైన పిక్నిక్ ప్రదేశం. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వేలాది మంది భారతీయ సైనికుల త్యాగాన్ని గుర్తు చేసే యుద్ధ స్మారక చిహ్నం ఇది. ఇక్కడికి వర్చువల్ టూర్ ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

Related Posts