YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 నష్టాల్లో మార్కెట్లు

 నష్టాల్లో మార్కెట్లు

 నష్టాల్లో మార్కెట్లు
ముంబై, ఏప్రిల్ 13
దేశీ స్టాక్ మార్కెట్ పతనమైంది. బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం డీలా పడ్డాయి. బేర్ దెబ్బకి బుల్ చతికిలపడింది. కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోవడం వంటి ప్రతికూలతల నడుమ మన మార్కెట్ కూడా నేలచూపులు చూసింది. ఏకంగా 1 శాతం మేర పడిపోయింది.
ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 685 పాయింట్ల నష్టంతో 30,474 పాయింట్లకు క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 200 పాయింట్ల క్షీణతతో 8912 పాయింట్లకు నష్టపోయింది. చివరకు మార్కెట్ నష్టాలు కొంత తగ్గాయి. సెన్సెక్స్ 470 పాయింట్ల నష్టంతో 30,690 పాయింట్ల వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 8994 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
✺ నిఫ్టీ 50లో ఎల్అండ్‌టీ, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వంటి షేర్లు లాభపడ్డాయి. ఎల్అండ్‌టీ 6 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
✺ అదేసమయంలో బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, టైటాన్ వంటి షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్ ఏకంగా 10 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. ఈ ఇండెక్స్‌లు 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 5 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు 3 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌లు 2 శాతం నష్టపోయాయి.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 76.28 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.98 శాతం తగ్గుదలతో 31.17 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.35 శాతం పెరుగుదలతో 22.84 డాలర్లకు ఎగసింది.
 

Related Posts