YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

లక్షా 14 వేలు దాటిన  మృతులు

లక్షా 14 వేలు దాటిన  మృతులు

లక్షా 14 వేలు దాటిన  మృతులు
 న్యూఢిల్లీ, ఏప్రిల్ 13
కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 114,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 18.50 లక్షలు దాటింది.గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 మంది మృతిచెందారు. అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వైరస్ మరణాలు, కేసులు అగ్రరాజ్యంలోనే నమోదవుతున్నాయి. మొన్నటి వరకూ మరణాల్లో తొలిస్థానంలో ఇటలీ ఉండగా.. దానిని అమెరికా అధిగమించింది.మొత్తం 1,853,155 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 423,554 మంది కోలుకున్నారు. మరో 1.26 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 50,900 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా అమెరికాలో మృతుల సంఖ్య 22 వేలు దాటింది. బాధితుల సంఖ్య 5.6 లక్షలకుపైగా నమోదైంది. అమెరికాలో కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరే ప్రతి 10 మంది మధ్య వయస్కుల్లో ఒకరు మృతిచెందుతున్నారని, 85 ఏళ్లు దాటినవారైతే ప్రతి పది మందిలో నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్య వయస్కులకూ ముప్పు పెరుగుతున్నట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది.అటు, రష్యాలోనూ కరోనా వేగం పెంచింది. గడచిన 24 గంటల్లోనే 2,186 కేసులు నమోదయ్యాయి. అందులో 1,306 మంది ఒక్క మాస్కోకు చెందినవారే. దీంతో రష్యాలో మొత్తం బాధితుల సంఖ్య 15,770కి పెరిగింది. ఇప్పటివరకు ఆ దేశంలో కొవిడ్‌ కారణంగా 130 మంది మరణించారు. స్పెయిన్‌లో శనివారం కాస్త తగ్గినట్లు కనిపించినా మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. ఆదివారం ఒక్కరోజే ఆ దేశంలో మరో 619 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీలోనూ 24 గంటల్లో 619 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో శవపేటికల కొరత ఏర్పడుతోంది.

Related Posts