YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు. *

కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు. *

కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు. *
*శ్రీగురుభ్యోనమః*
*"ప్రాణ వాయువు లేకుండా బ్రతకగలను కానీ, రామనామం లేకుండా బ్రతకలేను" అన్నారు బాపు.*_
*ఒకసారి లవకుశులు ఆంజనేయస్వామిని బంధించి గొప్ప వాళ్ళమనుకుంటే ఆయన నవ్వుకొని, "నేను బంధింపబడాలనే బంధింపబడ్డాను" అన్నాడు.*
*పిల్లకాయలు మహా బలవంతుడిని ఎలా బంధింపగలరు ? అలాగే, ఆత్మ ఎవరికి తెలియబడాలి అని అనుకుంటుందో వారికే తెలియబడుతుంది !**మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ, కారణం లేకుండా భక్తిరాదు. కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు !*
*నదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో అలాగే నీ హృదయంలో ఉన్న ఈశ్వరునిపై అనురాగం, ఆప్యాయత, భక్తి ప్రవహిస్తూ ఉండాలి.*_
*భగవంతుని మీద ఇంత ప్రేమ, భక్తి ఎందుకు కలిగింది అని ప్రశ్నించుకుంటే కారణం కనబడకూడదు !*_
*ఉన్నాడు.. అతడున్నాడు..!*
*అసలు దేవుడనేవాడున్నాడా? ఉంటే మనం చూడలేకపోతున్నామేం ? అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే..!*_
మామూలు చూపుతో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. కానీ, అంతమాత్రాన ఆయన లేడని చెప్పవచ్చా? దీనికో చిన్న ఉదాహరణ. రాత్రివేళ మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. కానీ, పగటిపూట అవేవీ కనిపించవు. అంతమాత్రాన అసలు అవి లేవని భావమా ? అజ్ఞానంతో, సంకుచిత దృష్టితో చూస్తే, మనం దేవుణ్ణి చూడలేం. అంతమాత్రాన దేవుడు లేడనీ, ఆయన అవసరమే లేదని అంటే శుద్ధ తప్పు.*_
*దైవాన్ని కనుగొనే వరకు తగిన గురు సహాయంతో శోధించి, తిరిగి ఏ ప్రశ్న తలెత్తని స్థితిని సాధించినప్పుడు దైవం గురించి తాను మాట్లాడే అర్హత సాధించినవాడవుతాడు ! ఈలోగా తనకున్న పాండిత్యంతో, మిడిమిడి జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకుండా, శుష్క ప్రేలాపణలు, కువిమర్శలు చేసే వాడు తనకు తెలిసిన పరిమిత విజ్ఞానంతో అజ్ఞానిగానే మిగిలిపోతాడు !*_
*మంచి మాట*
*గొప్ప మనస్సుగలవాడు పరిస్థితులు తారుమారు అయినప్పుడు, ఇబ్బందులకు లోనై కిందపడినా, బంతిలా మళ్ళీ పైకి ఎగురుతాడేగాని నలకు అతుక్కొని ఉండిపోడు. అందుకే మనం బంతిలా ఉండడానికి ప్రయత్నించాలే గాని మట్టిముద్దలా కాదు !*_
*జీవుడు తనలోని "నేను" అను అంతర్యామియగు ప్రజ్ఞామయమగు వెలుగును దర్శించి, తాను ఆ వెలుగుగా జీవించుటయే అతని జీవిత పరమార్థము.*
*ఈ స్థితిలో తన మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులన్నియు యోగముచే అంతర్యామి యందు పూవురేకుల వలె యుక్తములై పరిపూర్ణతను బడయును.*
*అపుడు ప్రపంచము తనకన్న ఇతరముగా గాక, తానుగా భాసించి యధార్థ జ్ఞానము తనలో‌ ప్రకాశించును. ఇట్టి దివ్యజ్ఞానమను వెలుగుతో కూడి‌న దేవాలయము చేరుట, అందు జీవించుట మన లక్ష్యము.‌‌‌....*

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts