YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

భారీగా విద్యుత్ కొనుగోళ్లు చేసిన ఏపీ

భారీగా విద్యుత్ కొనుగోళ్లు చేసిన ఏపీ

భారీగా విద్యుత్ కొనుగోళ్లు చేసిన ఏపీ
విజయవాడ, ఏప్రిల్ 14
సంక్షోభంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపైనే దృష్టి పెట్టినట్లు విద్యుత్‌ శాఖ తెలిపింది. మార్చి నెలలో మార్కెట్‌లో చౌక ధరకు లభించే విద్యుత్‌ కొనుగోలు చేసి రూ.56 కోట్లు మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చి నెలలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో తెలిపారు.  దేశవ్యాప్తంగా విద్యుత్‌ ధరలు తగ్గడాన్ని గుర్తించిన అధికారులు మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌నే తీసుకున్నారు.  మార్చి నెలలో మొత్తం 357.22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొన్నారు. యూనిట్‌కు గరిష్టంగా రూ.2.64 వరకూ చెల్లించారు.  విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించిన కొనుగోలు ధర కన్నా ఇది యూనిట్‌కు రూ.1.57 తక్కువ. కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్‌పై రూ.56 కోట్లు ఆదా అయింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి అప్రమత్తమయ్యారు.సమన్వయం, వాణిజ్య, సాంకేతిక విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబుకు అప్పగించి, అనుభవజ్ఞులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. గ్రిడ్‌ నిర్వహణ, రాష్ట్రంలో డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు, మార్కెట్లో విద్యుత్‌ లభ్యత, ఎంత చౌకగా ఏ సమయంలో దాన్ని తేవచ్చనే నిరంత విశ్లేషణలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలొచ్చాయి. మార్కెట్‌లో చౌక విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల థర్మల్‌ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి.ప్రస్తుతం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.

Related Posts