YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

 లాక్ డౌన్ తో సౌత్ కొరియా కాఫీ  హల్ చల్

 లాక్ డౌన్ తో సౌత్ కొరియా కాఫీ  హల్ చల్

 లాక్ డౌన్ తో సౌత్ కొరియా కాఫీ  హల్ చల్
హైద్రాబాద్, ఏప్రిల్ 14,
లాక్‌డౌన్‌ టైమ్‌లో సోషల్‌ మీడియాలో కొత్త కొత్త ట్రెండ్స్‌ అప్‌లోడ్‌ అవుతున్నాయి. వీటిలో అత్యధికమైన పోస్ట్స్‌ ఫుడ్‌ గురించే ఉంటున్నాయి. ఎక్కువ టైమ్‌ ఇంట్లో ఉండటంతో ఇప్పటిదాకా మర్చిపోయిన పాకశాస్త్రాన్ని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటున్నారు కొందరు. మరికొందరేమో.. హోటల్స్, రెస్టారెంట్‌ ఫుడ్‌కి అలవాటైన జిహ్వను అణుచుకోలేక  తమకు తామే స్వయంగా కొత్త వంటల్ని ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో సిటీజనులకు ఇప్పుడు క్రేజీగా మారింది డాల్గొనా. దక్షిణ కొరియాలోని స్పాంజీ టాఫీ నుంచి స్ఫూర్తి పొందిన ఈ డాల్గొనా కాఫీ... ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మూడు రకాల ముడి దినుసులతో తయారయ్యే ఈ కాఫీ ఇప్పుడు సిటీలో పలువురి ఇళ్లలోనూ ఘమఘమలు పంచుతోంది.  దక్షిణ కొరియా కాఫీ కల్చర్‌కు బాగా ఫేమస్‌. సాధారణ ముందస్తుగా కలిపిన ప్రీ మిక్సడ్‌ కాఫీ నుంచి ఆర్టిస్టిక్‌ క్యులినరీ విశేషాలు కలగలిసిన కాఫీలకూ అక్కడ డిమాండ్‌ ఎక్కువే. అచ్చం అక్కడిలానే నగరంలోనూ  యువత సోషలైజింగ్‌కు ఎక్కువగా కాఫీషాప్‌లే ఎంచుకుంటారనేది తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాఫీషాప్‌ ముఖం చూసి కూడా ఎన్నో ఏళ్లు గడిచినట్టయ్యిందని అంటున్నారు నగరవాసులు. ఈ పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చింది సింపుల్‌ హోమ్‌ మేడ్‌ కాఫీ డాల్గొనా. దీన్నిప్పుడు క్వారంటైన్‌ కాఫీ అని నెటిజన్లు పిలుస్తున్నారు. దీని తాలూకు రిసిపీ, ఫొటోలు, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్‌లలో సందడి చేస్తున్నాయి. కేవలం మూడు ముడి దినుసులతో సులభంగా తయారు చేసుకోగలగడంతో ఇప్పుడది క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ సహా పలువురికి క్వారంటైన్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. ఓ రెండు టేబుల్‌ స్పూన్ల కాఫీ పౌడర్, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార, 2 టేబుల్‌ స్పూన్ల హాట్‌ వాటర్, 2 కప్పుల బాయిల్డ్, కూల్డ్, చిల్డ్‌ మిల్క్‌, కొన్ని ఐస్‌ క్యూబ్స్‌లను సిద్ధం చేసుకోవాలి. బౌల్‌లో కాఫీ పౌడర్‌ వేసి పంచదార, హాట్‌ వాటర్‌ దానికి కలపాలి. బాగా అంటే నురుగ లాగ చిక్కగా అయ్యేవరకూ కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో నుంచి తీసిన చిల్డ్‌ మిల్క్‌ గ్లాసులో పోసుకోవాలి. తయారు చేసుకున్న నురగని గ్లాసుకు పైన తేలేలా పోయాలి. ఫ్లేవర్‌ పాలలో కలవడానికి ఓ మూల నుంచి ఒక్కసారి మాత్రం తేలికపాటి డిప్‌ చేయాలి. సర్వ్‌ చేసేటప్పుడు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు జెమ్స్, చాకో చిప్స్, చాక్లెట్‌ సిరప్‌.. వంటివి టాపింగ్స్‌గా వేసుకోవచ్చు.చాలా మంది సెలబ్రిటీలు డాల్గొనా సేవించడం చూశాను. నాకు పెద్దగా వంట రాదు. అయితే ఈ కాఫీ చాలా క్విక్‌గా,  సులభంగా తయారు చేసుకోవచ్చనేది ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా కొందరు చేస్తున్నప్పుడు అర్థమైంది. దాంతో నేనూ  ప్రయతి్నద్దామని అనుకున్నా. రిసిపి గురించి తెలుసుకుని తయారు చేశా. జెమ్స్, చాకో చిప్స్‌తో దానిని అలంకరించా. కోల్డ్‌ కాఫీ తాగకుండా నేనెప్పుడూ ఏ రెస్టారెంట్‌ కాఫీ షాప్‌ని దాటింది లేదు. దీంతో కోల్డ్‌ కాఫీ దొరక్క ప్రాణం గిలగిల్లాడిపోతోంది. సో.. నా కొత్త క్వారంటైన్‌ పార్ట్‌నర్‌గా ఇది మారిపోయింది.

Related Posts