YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 పసుపుపై కరోనా కాటు

 పసుపుపై కరోనా కాటు

 పసుపుపై కరోనా కాటు
నిజామాబాద్, ఏప్రిల్ 14
ప్రాణాంతకమైన ‘కరోనా’వైరస్‌ ప్రభావం పసుపు ఎగుమతులపై పడింది. చైనాకు ఎగుమతులు నిలిచిపోవడం, దీనికి తోడు దేశీయ మార్కెట్‌లో పాత నిల్వలు పేరుకుపోవడంతో ఈ సీజన్‌లో పసుపు ధర పూర్తిగా పతనమైందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడినుంచి పసుపు అత్యధికంగా ఇరాన్‌ దేశానికి ఎగుమతి అవుతుంది. అలాగే ఐరోపా దేశాలతో పాటు, చైనాకు కూడా పసుపు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా ఇరాన్‌లో పరిస్థితులు బాగా లేకపోవడం మరో పక్క చైనాలో కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన సంక్షోభం కారణంగా ఎగుమతులు పూర్తిగా పడిపోవడంతో దేశీయ మార్కెట్‌లో ధర తగ్గిపోయిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.పసుపు ధర పతనమై క్వింటాలుకు కనిష్టంగా రూ.3,800 చేరడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ మార్కెట్‌కు పసుపు రాక ఊపందుకుంది. జనవరిలో మొత్తం 38 వేల క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా, ఈనెల 25వ తేదీ నుంచి పంట రావ డం మరింతగా పెరుగుతుంది. గతేడాది కంటే క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేయడంతో పసుపు రైతులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పం ట సగటు ధర క్వింటాలుకు 5,500 వరకు పలికింది. గరిష్టంగా రూ.6,718 వరకు కొను గోలు చేసిన వ్యాపారులు, ఇప్పుడు పూర్తిగా ధర తగ్గించడంతో పసుపు రైతులు పరేషా న్‌లో పడ్డారు.పసుపు పాత నిల్వలు కూడా భారీగా పేరుకు పోయాయని వ్యాపారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 25 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు నిల్వలున్నాయని అంచనా వేస్తున్నారు. ఒక్క నిజామాబాద్‌ మార్కెట్‌ పరిధిలోనే సుమారు 3 లక్షల క్వింటాళ్ల పసుపు కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో గత ఏడాదితోపాటు అంతకు ముందు సీజనుకు సంబంధించిన పసుపు కూడా ఉంటుందని చెబుతున్నారు.విదేశాలకు పసుపు పంట ఎగుమతి తగ్గింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. అలాగే అత్యధికంగా కొనుగోలు చేసే ఇరాన్‌ కూడా సంక్షో భంలో ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ డిమాండ్‌ తక్కువగా ఉంది. దీంతో ధర పెట్టలేకపోతున్నాము. అలాగే మహారాష్ట్రలో పసు పు విస్తీర్ణం పెరగడంతో పంట ఎక్కువగా వస్తోంది. డిమాండ్, సరఫరాకు తేడా ఉండటంతో ధర తగ్గుతోందని వాపోతున్నారు. ఎగుమతిదారుడువ్యాపారులు పసుపు ధర పూర్తిగా తగ్గించారు. మంచి రకం పంటను మార్కెట్‌కు తెస్తే క్వింటాలుకు రూ.5,385 ధర పెట్టిండ్రు. ఈ ధరకు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. రెండు ఎకరాల్లో పసుపు వేసుకున్న. ఎరువు, విత్తనం, కూలీ ఖర్చులన్నీ కలిపి పెట్టుబడి రూ.లక్షన్నర దాటింది
 

Related Posts