అందుబాటులోకి మెడికల్ సర్వీసెస్
హైద్రాబాద్, ఏప్రిల్ 14
లాక్ డౌన్ తో ఎక్కడివాళ్లుఅక్కడ ఉండిపోయారు. పిల్లలు ఒకచోట, తల్లి దండ్రులు ఒకచోట. నగరంలో కొందరు, ఊళ్లల్లో మరికొందరు ఇలా పరిస్థి తి. ఇప్పటి లైఫ్ స్టైల్ లో ఎక్కువ మంది ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. కొందరికి డైలీ మెడిసిన్స్ తప్పని సరి. వయస్సు మీద పడిన వారు బయటకువెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోలేక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అలాంటికి వారికి సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు మెడిసిన్ అందిస్తూ ఆపదలో ఆదుకుంటోంది. హైదరాబాద్ లో ఈ సంస్థ పదేళ్లుగా కరప్ష న్ పై పోరాడుతోంది. లాక్ డౌన్ నేపధ్యంలో ఈ నెల 3 నుంచి మెడికల్ సర్వీస్ ప్రారంభించింది. సిటీలో 500 మంది వలంటీర్లు ఉన్నారు. 70 మందికి బైక్స్ ఉన్నాయి. ఇంట్రస్ట్ ఉన్నవారిని మరో 40 మందిని కలుపుకొని 110 మంది సేవలందిస్తున్నారు.ఈ సంస్థకు ఫేస్ బుక్ లో 12 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్వయిజర్లుగా వ్యవహరిస్తున్నారు. మెడిసిన్స్ సర్వీస్ చేయాలనుకున్నాక మొదట ఫేస్ బుక్ పేజీలో ఈ విషయం పోస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపు ల్లో షేర్ చేసి, కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. మెడిసిన్స్ డీటెయిల్స్, అడ్రస్ వాట్సాప్ చేస్తే వలంటీర్లు షాప్ కు వెళ్లి మందులు కొంటారు. బైక్ మీద వెళ్లి బాధితులకు అందిస్తారు. మెడిసిన్స్ అందించిన తర్వాత మనీ ఇస్తే తీసుకుంటారు. లేవంటే, ఫ్రీగానూ అందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు, గర్భిణులకు కూరగాయలు, సరుకులు కూడా తెచ్చిపెడుతున్నారు. 5 రోజుల్లో 350 మందికి పైగా సాయంచేసినట్లు ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. సిటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నూ మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక్కరోజులో 15 మందికి అందించారు.