YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నారాయణస్వామికి ఇక తిప్పలే

నారాయణస్వామికి ఇక తిప్పలే

నారాయణస్వామికి ఇక తిప్పలే
తిరుపతి, ఏప్రిల్ 14
నోరు కంట్రోల్ లో పెట్టుకోకుంటే ఎప్పటికైనా అనర్థమే. అందునా ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. మంత్రి పదవిలో ఉండి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ఒక మంత్రి పదవికి ఎసరు తెచ్చినట్లే కన్పిస్తున్నాయి. అసలే కరోనాతో రాష్ట్రం మొత్తం అల్లాడి పోతుంటే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోందిముఖ్యమంత్రి జగన్ స్వయంగా కరోనా వైరస్ విషయంలో ఏ వర్గాన్ని కించపర్చే విధంగా మాట్లాడ వద్దని ఇటీవల మీడియా సమావేశంలో కోరారు. ఎవరూ కావాలని చేయరని, మర్కజ్ మసీదు ప్రార్థనల విషయం పదే పదే ప్రస్తావించవద్దని కూడా ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఏమతం వారైనా ముప్పు ఉందని తెలిసి వెళ్లరని, తెలియకుండా జరిగిన తప్పుకు ఎవరినీ బాధ్యులను చేయవద్దని కూడా జగన్ విజ్ఞ.ప్తి చేశారు. ఇది సోషల్ మీడియాను జగన్ ఉద్దేశించి అన్న వ్యాఖ్యలే. కానీ తన కేబినెట్ మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలు చేయడం జగన్ కు ఇబ్బందిగా మారింది.రెండురోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పుత్తూరులో మీడియాతో మాట్లాడారు. కొందరు వైద్యానికి సహకరించడం లేదని, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, పళ్లేలు నాకుతున్నారంటూ ఒకవర్గాన్ని ఉద్దేశించి నారాయణస్వామి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నారాయణస్వామిని ట్రోల్ చేస్తూ అనేకమంది ఎండగట్టారు. దీంతో జగన్ నారాయణస్వామి నుంచి వివరణ కోరినట్లు తెలిసింది.ఉపముఖ్యమంత్రిగా ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడమేంటని ఫోన్ లోనే జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. అయతే దీనికి నారాయణస్వామి వివరణ ఇచ్చుకున్నారు. తాను కావాలని చేయలేదని, అవగాహన కల్పించే యత్నంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. కానీ జగన్ మాత్రం వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించడంతో నారాయణస్వామి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. కానీ నారాయణస్వామికి పదవిగండం పొంచి ఉన్నట్లేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. జగన్ నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోలేనివి అన్నట్లు చెబుతున్నారు. దీంతో కరోనా కొంచెం శాంతించాక ఆయన పదవికి ఎసరు తప్పదన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది.

Related Posts