YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సూపర్ కార్లతో రామచరణ్...

సూపర్ కార్లతో రామచరణ్...

సూపర్ కార్లతో రామచరణ్...
హైద్రాబాద్, ఏప్రిల్ 14 
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా తెలుగు చిత్రసీమలో తెరంగేట్రం చేశాడు రామ్ చరణ్. తొలి సినిమాతోనే బాక్సాఫీసుపై 'చిరుత'లా విజృంభించి.. టాలీవుడ్ లో 'మగధీరుడి'లా నిలిచాడు. నైజాం, సీడెడ్, సర్కారు ప్రాంతమేదైనా.. కలెక్షన్ల సునామితో 'రచ్చ' చేస్తూ.. 'నాయక్' తో అసలైన కథానాయకుడిగా ఎదిగాడు. టాలివుడ్ లో వరుస హిట్లు అందుకుంటూ ఆకాశంలో 'ధృవ' తారగా వెలుగొందాడు. 'రంగస్థలం'పై అసలైన నటుడిగా గుర్తింపు తెచ్చుకొని 'ఎవడి'కి అందనంత ఎత్తకు ఎదిగాడు. త్వరలో ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళితో దర్శకత్వంలో రానున్న చిత్రంలో అల్లూరి సీత రామరాజుగా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన 'ఆర్ఆర్ఆర్' టీజర్లో రామ్ చరణ్ మరో సారి అల్లూరిని మన ముందుకు తీసుకొచ్చాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాత గానూ తనదైన ముద్ర వేశాడు. కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి తండ్రి చిరంజీవితో 'ఖైదీ నెం.150', 'సైరా' చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్నాడు. సినిమాలే కాకుండా మన మెగాపవర్ స్టార్ కు ఖరీదైన విలాసవంతమైన కార్లంటే కూడా ఎంతో ఇష్టం. మరి రామ్ చరణ్ కున్న పవర్ ఫుల్ కార్లేంటో ఇప్పుడు చూద్దాం.భారత్ లో ఈ కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తి రామ్ చరణే. ఇంతకీ ఈ ధర ఎంతంటే రూ.2 కోట్లు. రామ్ చరణ్ ఈ వాహనాన్ని తనంతట తాను కొనుగోలు చేయలేదు. తన అత్తగారు మెగాపవర్ స్టార్ విహవాం బహుమతిగా ఇచ్చారు. ఆస్టన్ మార్టిన్ కార్లను ఎక్కువగా జేమ్స్ బాండ్ చిత్రాల్లో ఎక్కువగా చూస్తుంటాం. త్వరలో విడుదల కానున్న జేమ్స్ బాండ్ 25వ చిత్రంలోనూ కనిపించనుందీ కారు. ఈ బ్రిటీష్ స్పోర్ట్స్ కారు 4.8-లీటర్ వీ8 ఇంజిన్ ను కలిగి ఉండి 420 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 470 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.రామ్ చరణ్ వద్ద ఉన్న మొదటి బ్రిటీష్ కారు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫి మోడల్. ఈ ఎస్ యూవీ ధర వచ్చేసి రూ.3.5 కోట్లు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 8-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఇది 5.0-లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 503 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 625 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.బ్రిటీష్ కు చెందిన సంస్థ నుంచి రామ్ చరణ్ సొంతం చేసుకున్న మరో వాహనం రోల్స్ రాయిస్ ఫాంటం. ఈ లగ్జరీ ఎస్ యూవీ 6.8-లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ ను 460 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 720 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్ యూవీ ధర వచ్చేసి రూ.3.34 కోట్లు. ఈ కారును మెగాపవర్ స్టార్ కు చిరంజీవి బహుమతిగా ఇచ్చాడు. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో ఈ వాహనం ఆకట్టుకుంటోంది.
 

Related Posts