YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మే 3 వరకు లాక్ డౌన్ పొడిగింపు

మే 3 వరకు లాక్ డౌన్ పొడిగింపు

మే 3 వరకు లాక్ డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ ఏప్రిల్ 14 
కరోనా విజృంభణ నేపథ్యంలో. మే 3 వ తేదీవరకు కు లాక్ డౌన్  పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మంగళవారం ఉదయం అయన జాతీనుద్దేశించి ప్రసంగించారు.  లాక్ డౌన్ కు ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. దేశంలో కొవిడ్-19 కేసులు 100 నమోదు కాకముందే విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, క్వారంటైన్ వంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో 550 కేసులు నమోదు కాగానే 21 రోజుల లాక్ డౌన్ విధించామని చెప్పారు. దేశంలోని ప్రతి హాట్ స్పాట్ పై దృష్టి ఎక్కువ పెడతామని అయన అన్నారు. ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని అన్నారు. బుధవారం గైడ్ లైన్స్ ప్రకటిస్తామని అయన అన్నారు. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కరోనాపై భారత్ బలంగా పోరాడుతోందని అయన ప్రశంసించారు. ఇతర దేశాల కంటే భారత్ లో కరోనా వ్యాప్తి 20 నుంచి 30 శాతం వరకూ తక్కువగా ఉందని ప్రధాని అన్నారు. అంబేద్కర్ చెప్పిన మాటలు మనకు నిరంతరం ప్రేరణ ఇస్తున్నాయని మోదీ తెలిపారు. ప్రజలు ఒక్కతాటిపై నిలబడి పరస్పరం సహకరించుకోవడమే అంబేద్కర్ కు  ఇచ్చే నివాళని చెప్పారు. నిరుపేదలను ఆదుకోవాలి. ఇంట్లోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాని సూచించారు. మే 3 వరకు దేశ పౌరులు అందరూ సహకరించాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. పరిస్థితులు చేజారిపోయే వరకు చూస్తూ ఊరుకోవద్దని ప్రధాని చెప్పారు.  కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని తన ప్రసంగంలో  పేర్కొన్నారు.
======================

Related Posts