YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసమానతలు తొలగించిన అంబేద్కర్

అసమానతలు తొలగించిన అంబేద్కర్

అసమానతలు తొలగించిన అంబేద్కర్
నందికొట్కూరు ఏప్రిల్ 14 
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్  129వ జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్  విగ్రహానికి  నందికొట్కూరు శాసనసభ్యుడు తొగురు ఆర్థర్  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రపంచంలొనే అత్యంత పెద్ద రాజ్యాంగంను రాసి కుల , మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేకుండా, రాజ్యాంగం ముందు అందరూ సమానులే  అని ప్రజల చేత,  ప్రజల కొరకు, ప్రజల కోసం ప్రజాస్వామ్యం అని  అంబేద్కర్ నిరూపించారని అన్నారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును అందరికి సమానం గా కలిపించి, చివరకి ఈ దేశంలొ పుట్టిన మనుషులకే కాదు జంతువులకి కూడా రక్షణ కలిపించే దృఢమైన గొప్ప రాజ్యంగాన్ని రాసిన గొప్ప మేధావి అని కొనియాడారు. భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అంత లోతుగా అర్థం చేసుకొని  అసమానతలను తొలగించాలనే సంకల్పం ఉన్న ఏకైక  నాయకుడు డా,,బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు.

Related Posts