YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

మోడీ సప్తపది

మోడీ సప్తపది

మోడీ సప్తపది
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 
కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయన్నారు. లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసిన మోదీ...దేశ ప్రజలకు ఏడు సూచనలు చేశారు.కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్‌ డౌన్‌ను లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా వైరస్ విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదన్నారు ప్రధాని. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉందన్నారు. నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయన్నారు.భారత్ లాక్ డౌన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేమన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్నది మనం చూస్తేనే ఉన్నామన్నారు. మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుందన్నారు. సామాజిక దూరం పాటించడం, లౌక్‌డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగిందన్నారు ప్రధాని. లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసిన మోదీ...దేశ ప్రజలకు ఏడు సూచనలు చేశారు. ప్రతీ ఒకరు దీన్ని తప్పకుండా పాటించాలని కోరారు.
ప్రధాని చెప్పిన ఏడు సూత్రాలు:
1. వయసు పైబడిన పెద్దవాళ్లను కొవిడ్ నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి.
2. అత్యవసర విధుల్లో ఉన్న డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వాలి.
3. పేదలకు, అన్నార్తులకు ఆహారాన్ని అందించేందుకు వీలైనంత మేరకు మరింత సాయం అందించాలి.
4. ప్రైవేటు ఉద్యోగులపై వేటు వేసే ఆలోచనలను యాజమాన్యాలు చేయరాదు.
5. రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా, పోషకాహారాన్ని తీసుకోవడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలి.
6. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి.
7. భౌతిక దూరం పాటించడంతో కరోనా దూరం అవుతుంది కాబట్టి, బయటకు వెళితే, ఒకరితో ఒకరు దగ్గరగా మెసలవద్దు.
ఈ ఏడు సూత్రాలనూ పాటించడం ద్వారా ఇండియా నుంచి కరోనాను శాశ్వతంగా పారద్రోలవచ్చని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజలు వీటిని విధిగా పాటించాలని నమస్కరిస్తూ మోదీ కోరారు.

Related Posts