YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మే 3 వరకు అన్నీ ట్రైన్స్  బంద్

మే 3 వరకు అన్నీ ట్రైన్స్  బంద్

మే 3 వరకు అన్నీ ట్రైన్స్  బంద్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14
ట్రైన్ జర్నీ చేయాలని భావిస్తున్న వారికి ఝలక్. ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ సర్వీసులు ఇప్పట్లో పునరుద్ధరించడం లేదని పేర్కొంది. అన్ని రకాల ప్యాసింజర్ ట్రైన్స్‌ను మే 3 వరకు నడుపబోమని స్పష్టం చేసింది.మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్రీమియం ట్రైన్స్, కోల్‌కతా మె్రటో, సబ్‌అర్బన్ ట్రైన్స్, కొంకన్ రైల్వే ఇలా ఇవ్వన్నీ మే వరకు తిరగవు. అంతేకాకుండా ట్రైన్ టికెట్ బుకింగ్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రైల్వే స్టేషన్ కౌంటర్‌లో కానీ లేదంటే పరిసర ప్రాంతాల్లో కానీ టికెట్ బుకింగ్ సౌకర్యం ఉండదని పేర్కొంది.కాగా ఇండియన్ రైల్వేస్ ఇటీవల ప్యాసింజర్ ట్రైన్ సర్వీసులను ఏప్రిల్ 14 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత చాలా నివేదికలు మాత్రం ఏప్రిల్ 14 తర్వాత ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే వీటిని నమ్మవద్దని రైల్వేస్ తెలిపింది. ఇప్పుడు లాక్ డౌన్ పొడిగింపు వల్ల ట్రైన్ సర్వీసులు కూడా మే 3 వరకు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.కాగా ఇండియన్ రైల్వేస్ సరుకు రవాణా ట్రైన్స్‌ను మాత్రం తిప్పనున్నాయి. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఇండియా పోస్ట్ వంటివి ఇప్పుడు ట్రైన్ సర్వీసులను ఉపయోగిస్తున్నాయి. ఇండియన్ రైల్వేస్ 58కి పైగా రూట్లలో 109 పార్సిల్ ట్రైన్స్‌ను దుబాటులో ఉంచింది. ఇక ఐఆర్‌సీటీసీ కూడా తన ప్రైవేట్ ట్రైన్స్‌ను మే 3 వరకు క్యాన్సిల్ చేయొచ్చు.దేశ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా లాక్ డౌన్ పొడిగిస్తున్న ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఉద్యోగులను తొలగించొద్దని కంపెనీలను కోరారు. ఆర్థిక వ్యవస్థ పరంగా చేస్తే లాక్ డౌన్ పొడిగింపు అనేది చాలా ఖరీదైన నిర్ణయమని తెలిపారు. కానీ భారతీయుల ప్రాణాల కోణంలో చేస్తూ ఈ నిర్ణయం తీసుకోక తప్పదని పేర్కొన్నారు. కాగా భారత్‌లో కరోనా వైరస్ కేసులు ఇప్పటికే 10,000 దాటిపోయాయి. 300 మందికిపైగా మరణించారు.

Related Posts