YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 55 వేలకు బంగారం

 55 వేలకు బంగారం

 55 వేలకు బంగారం
ముంబై, ఏప్రిల్ 14
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయతే మీకు ఝలక్. పసిడి ధర భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది 24 శాతం మేర పరుగులు పెట్టిన పసిడి ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.55,000 స్థాయికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు.2020 చివరకు బంగారం ధర రూ.50,000- రూ.55,000కు చేరొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి ధర వచ్చే 2-3 ఏళ్లలోనూ పెరగొచ్చని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై నెలకొన్ని ఆందోళనలు ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధర రూ.6,800 పెరిగింది. అంటే 17 శాతం పరుగులు పెట్టింది.పీఎన్‌జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సురభ్ గాడ్గిల్ మాట్లాడుతూ.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో బంగారాన్ని కొంటూ వెలితే మంచిదని సూచించారు. బంగారం ధర రూ.41,000 వద్ద ఉన్నప్పుడు కొనుగోలు చేయవచ్చనని పేర్కొన్నారు.కాగా బంగారాన్ని సురక్షితనమై ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా భావిస్తారు. యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు వంటివి సంభవించినప్పుడు బంగారం పరుగులు పెడుతుంది. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. అందుకే కరోనా వైరస్ వల్ల ఆర్థి మాంద్యం పరిస్థితులు నెలకొన్ని నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్లు గత ఆరేళ్లలో ఇప్పుడే పెరిగాయి.ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ.44,500కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,840కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.150 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.41,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పైకి కదలడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Related Posts