ఆన్ లైన్ లో పదవ తరగతి పాఠాలు
అమరావతి ఏప్రిల్ 14
లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నాం. పరీక్షలు జరిగేంత వరకు వారికి సీఎం ఆదేశాలు మేరకు ఆన్ లైన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఉదయం 10-11, సాయంత్రం 4-5 ఇవి ప్రసారం అవుతాయి. అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్ లో కూడా అందుబాటులో ఉంచుతాం. విద్యామృతం పేరుతో కార్యక్రమం రూపొందించాం...అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి అధ్యాపకుల ఎంపిక చేస్తాం. ఇప్పటికే ట్రయిల్ రన్ చేసామని అయన అన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దు. ఈ క్లాసులను వినియోగించుకోండి. ఆన్లైన్ లో చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయలు కూడా ముందుకురావచ్చని మంత్రి అన్నారు.