YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెదేపా కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

తెదేపా కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

తెదేపా కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ఖమ్మం, ఏప్రిల్ 14
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం బీ ఆర్ అంబేద్కర్ జయంతి  వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూరపాటి మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్లమెంటరీ కమిటీ నాయకులుగుత్తా సీతయ్య,కేతినేని హరీష్ ,కొండబాల కర్ణాకర్, మల్లెంపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
కరోనా మహమ్మారి వైరస్ కట్టడిలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైన తెలుగు యువత,టిఎన్ఎస్ఎఫ్ ల ఆధ్వర్యంలో మంగళవారం పలు చోట్ల ఆహారం ప్యాకెట్లును అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లోని కొత్త బస్టాండ్ ,ఎన్టీఆర్ సర్కిల్, మారెమ్మ గుడి సెంటరలల్లో ఆహారం ప్యాకెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ ,నగర కన్వీనర్ మల్లెంపాటి అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ , కాంపాటి వెంకన్న, కమల్ కాంత్, ప్యారీస్ వెంకన్న, నాగేశ్వరరావు,తెలుగు యువత జిల్లా నాయకులు నల్లమల రంజిత్, చాగంటిహరీష్ , సాయి తేజ,నాగ దాసరి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు కన్నేటి పృథ్వి, భూక్య అశోక్,బ్రహ్మం, సుబ్బారావు, క్రాంతి, మహిళా నాయకురాలు  శ్రీ రజిని,టి ఎన్ టి యు సి నాయకులు గోపి శంకర్, గోపి రవి లు పాల్గొన్నారు.
 

Related Posts