ఇంటింటికి మెడికల్ స్క్ర్రీనింగ్ పరీక్షలు
కర్నూలు, ఏప్రిల్ 14
నగరంలో నగరంలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత తీవ్ర కఠినతరం చేస్థున్నట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్పలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా గనిగల్లీ నగర్, బుధవారపేట ప్రాంతాలలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రెండు ప్రాంతాల్లో హై రిస్క్ అలర్ట్ ప్రకటించి, లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలెవరిని ఇళ్ల నుండి బయటకు రానీయకుండా వుండడంతో పాటు సంబంధిత ప్రాంతాల్లో ఇరువైపుల రాకపోకలు జరగకుండా పటిష్ట బందోబస్తుతో కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైపో సోడియం ఫ్లోరైడ్ ద్రావణం, బ్లీచింగ్ పౌడర్ తో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబును కలెక్టర్ ఆదేశించామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా కూరగాయలు,నిత్యావసర వస్తువులు ఇంటింటికి సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. సర్వే లైన్ టీమ్ ల ద్వారా ఇంటింటికి వెళ్లి మెడికల్ స్క్ర్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు.