1998 అక్టోబర్ లో కంకాని దగ్గర కృష్ణ జింకల వేటాడినట్లు సల్మాన్ ఖాన్ , తదితరులు ఫై కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే. తుది తీర్పు వెలువరించిన జోధ్ పూర్ కోర్ట్ , సల్మాన్ కి ఐదు ఏళ్ళ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ కేసు లో దోషిగా సల్మాన్ ని నిర్ధారించింది. మిగిలిన నిందితులైన సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం ను కోర్ట్ నిర్దోషులు గా నిర్దారించింది. సల్మాన్ కి శిక్ష ఖరారు అవగానే ఆయన ని జైలు కి తరలించడానికి పోలీసులు అన్ని రకాల భద్రతలు తీసుకున్నారు. సల్మాన్ జైలు పాలు కావడంతో నిర్మాతలు అందరూ ఆందోళనలో పడుతున్నారు.